Breaking News

నగాల్‌ పునరాగమనం

Published on Sat, 07/26/2025 - 03:52

న్యూఢిల్లీ: కేంద్రం నుంచి నిధులు పొందుతూ... జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు విముఖత చూపితే... వారికి నిధులు నిలిపివేస్తామని ఇటీవల కేంద్ర క్రీడా శాఖ జారీ చేసిన హెచ్చరికలు ఫలితాన్నిచ్చాయి. డేవిస్‌ కప్‌ టీమ్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు సింగిల్స్‌ స్టార్‌ సుమిత్‌ నగాల్‌... డబుల్స్‌ స్పెషలిస్ట్‌ యూకీ బాంబ్రీ మళ్లీ ముందుకొచ్చారు. ఈ ఏడాది సెపె్టంబర్‌ 12 నుంచి 14 వరకు స్విట్జర్లాండ్‌తో బీల్‌ నగరంలో జరిగే డేవిస్‌కప్‌ వరల్డ్‌ గ్రూప్‌–1 మ్యాచ్‌లో పాల్గొనే భారత జట్టును శుక్రవారం ప్రకటించారు.

సింగిల్స్‌లో సుమిత్‌ నగాల్, కరణ్‌ సింగ్, ఆర్యన్‌ షా... డబుల్స్‌లో యూకీ బాంబ్రీ, శ్రీరామ్‌ బాలాజీ ఎంపికయ్యారు. హైదరాబాద్‌ ప్లేయర్‌ బొల్లిపల్లి రిత్విక్‌ చౌదరీ, శశికుమార్‌ ముకుంద్, దక్షిణేశ్వర్‌ సురేశ్‌ రిజర్వ్‌ ఆటగాళ్లుగా ఉన్నారు. ప్రపంచ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో 306వ స్థానంలో ఉన్న సుమిత్‌ నగాల్‌ చివరిసారి 2023లో డేవిస్‌కప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 

ఆ తర్వాత పాకిస్తాన్, స్వీడన్, టోగో జట్లతో జరిగిన మ్యాచ్‌లకు సుమిత్‌ దూరంగా ఉన్నాడు. ప్రపంచ డబుల్స్‌ ర్యాంకింగ్స్‌లో 35వ స్థానంలో ఉన్న యూకీ బాంబ్రీ గత ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్‌తో ఆడిన తర్వాత స్వీడన్, టోగో జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో పాల్గొనలేదు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)