Breaking News

బ్రిటన్ కింగ్‌ను కలిసిన టీమిండియా.. వీడియో వైరల్‌

Published on Tue, 07/15/2025 - 18:50

ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో భార‌త పురుష‌ల‌, మ‌హిళ‌ల జ‌ట్ల ప్లేయ‌ర్లు బ్రిట‌న్ కింగ్ చార్లెస్ IIIను క‌లిశారు. మంగళవారం లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌ను శుబ్‌మ‌న్ గిల్ సార‌థ్యంలోని మెన్స్ టీమ్‌, హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని ఉమెన్స్ టీమ్‌, హెడ్ కోచ్‌లు గౌతం గంభీర్‌, ముజుందార్‌లు సంద‌ర్శించారు.

ఈ క్ర‌మంలో హృదయపూర్వకంగా స్వాగ‌తం ప‌లికిన చార్లెస్ III.. కాసేపు వారితో ముచ్చ‌టించారు. ప్ర‌తీ  ఒక్కరితో క‌ర‌చాల‌నం చేస్తూ న‌వ్వుతూ ప‌ల‌క‌రించారు. అంద‌రితో క‌లిసి ఆయ‌న‌ గ్రూపు ఫోటో దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌లవుతోంది. ప్లేయ‌ర్లు, కోచింగ్ స్టాప్‌తో పాటు బీసీసీఐ  కార్యదర్శి దేవజిత్ సైకియా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సైతం కింగ్‌ను క‌లిశారు. 

చాలా సంతోషంగా ఉంది: గిల్‌
ఇక బ్రిట‌న్ కింగ్‌ను క‌ల‌వ‌డంపై భార‌త కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ స్పందించాడు. "కింగ్ చార్లెస్‌ను కలవడం చాలా సంతోషంగా ఉంది. ఆయ‌న మ‌మ్మ‌ల్ని ఎంతో అప్యాయ‌త‌గా ప‌ల‌కరించారు. మేము చాలా విష‌యాలు ఆయ‌న‌తో సంభాషించాము. లార్డ్స్ టెస్టులో సిరాజ్ ఔటైన తీరు చాలా దురదృష్టకరమని ఆయ‌న అన్నారు.

మాకు ఈ మ్యాచ్‌లో ఆదృష్టం కలిసిరాలేదని ఆయనకు చెప్పాను" అని గిల్ పేర్కొన్నాడు. కాగా లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ 22 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆఖరి వరకు పోరాడనప్పటికి టీమిండియాకు పరాజయం తప్పలేదు. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జూలై 23 నుంచి ప్రారంభం కానుంది.


 

 

Videos

మాకు రావాల్సింది రాకపోతే... చంద్రబాబుకు బొప్పరాజు మాస్ వార్నింగ్

ఆ 55 ఎకరాలు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు బిగ్ షాక్

ప్రకృతి డేంజర్ సిగ్నల్స్ ఇది వానా కాలమా.. ఎండా కాలమా..!

దళితులను, గిరిజనులను మనుషుల్లా చూడట్లేదు చంద్రబాబుపై దళిత నాయకులు ఫైర్

రూపాయి పతనం.. బంగారం ధరలపై ఎఫెక్ట్!

గుర్తుపెట్టుకో నైతిక విలువలు ముఖ్యం.. బొత్స అదిరిపోయే కౌంటర్

జగదీశ్వర్ రెడ్డి పై పగతో స్లో పాయిజన్ పోలీస్ విచారణలో కీలక విషయాలు

Bigboss: హౌస్ లో కొత్త డ్రామా.. రిస్క్ లో రామ్ ప్రసాద్.!

ఎవరూ శాశ్వతం కాదు.. మజ్జి శ్రీను పార్టీ మారడంపై స్ట్రాంగ్ రియాక్షన్

నువ్వు మంత్రివా! DSC స్కామ్ అడ్డంగా దొరికిన లోకేష్

Photos

+5

ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు)

+5

వైష్ణవి చైతన్య ‘ఎపిక్‌’ లుక్స్‌.. షూటింగ్‌ ఫొటోలు వైరల్‌

+5

వినాయక చవితి 2026...నేను రెడీ అంటున్న గణేష్ (ఫొటోలు)

+5

కొత్త ఐఫోన్ 18 ప్రో వచ్చేసింది (ఫోటోలు)

+5

‘కాగితం పడవలు’ సినిమా టీజర్ విడుదల (ఫొటోలు)

+5

అప్పటి కాలేజ్‌ లుక్‌.. ఇప్పటి స్టార్‌ హీరోయిన్స్‌! (ఫోటోలు)

+5

కాఫీ కప్‌తో కీర్తి.. అదిరిన కాఫీ లుక్‌! (ఫోటోలు)

+5

సింపుల్ లుక్‌లోనే స్టన్నింగ్ బ్యూటీ భూమిక చావ్లా.. వైరల్ అవుతున్న ఫొటోలు

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)