Breaking News

భారీ బృందంతో బరిలోకి భారత్‌

Published on Fri, 06/27/2025 - 04:11

న్యూఢిల్లీ: వచ్చే నెలలో జరిగే ప్రతిష్టాత్మక ఆసియా అండర్‌–19 జూనియర్‌ టీమ్, వ్యక్తిగత బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ భారీ బృందంతో బరిలోకి దిగనుంది. ఐదు విభాగాల్లో కలిపి భారత్‌ నుంచి మొత్తం 19 మంది క్రీడాకారులు ఈ టోర్నీ లో పోటీపడనున్నారు. ఇండోనేసియాలోని సోలో నగరంలో జూలై 18 నుంచి 27వ తేదీ వరకు ఈ టోర్నీని నిర్వహిస్తారు. భారత జట్టులో తెలంగాణ నుంచి నలుగురు... ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముగ్గురు ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. 

తెలంగాణకు చెందిన ప్రణవ్‌ రామ్‌ నాగలింగం పురుషుల సింగిల్స్‌లో, తన్వీ రెడ్డి అంద్లూరి మహిళల సింగిల్స్‌లో ఆడతారు. తెలంగాణకే చెందిన వెన్నెల కలగోట్ల సింగిల్స్‌తోపాటు డబుల్స్‌లో, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మంచాల కీర్తి పోటీపడుతారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అరిగెల భార్గవ్‌ రామ్, గొబ్బూరు విశ్వతేజ్‌ పురుషుల డబుల్స్‌లో... కోడె విష్ణు కేదార్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బరిలోకి దిగుతారు.   

భారత జట్టు: అన్ష్ నేగి, లాల్‌థజువాలా, రౌనక్‌ చౌహాన్, ప్రణవ్‌ రామ్‌ నాగలింగం (పురుషుల సింగిల్స్‌). రుజులా రాము, తన్వీ శర్మ, తన్వీ రెడ్డి అంద్లూరి, వెన్నెల కలగోట్ల (మహిళల సింగిల్స్‌). అరిగెల భార్గవ్‌ రామ్, గొబ్బూరు విశ్వతేజ్, భవ్య ఛాబ్రా, పరమ్‌ (పురుషుల డబుల్స్‌). వెన్నెల, రేషిక, గాయత్రి, మాన్సా రావత్‌ (మహిళల డబుల్స్‌). కోడె విష్ణు కేదార్, మంచాల కీర్తి, లాల్‌రామ్‌సాంగా, తారిణి సూరి (మిక్స్‌డ్‌ డబుల్స్‌).  

Videos

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)