Breaking News

శరత్‌ కమల్‌ శకం ముగిసె...

Published on Sun, 03/30/2025 - 01:26

చెన్నై: భారత టేబుల్‌ టెన్నిస్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ప్లేయర్‌ ఆచంట శరత్‌ కమల్‌ తన ఆట ముగించాడు. వరల్డ్‌ టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ కంటెండర్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో పరాజయంతో అతను రిటైర్‌ అయ్యాడు. ఈ టోర్నీ ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో సూరావజ్జుల స్నేహిత్‌ (తెలంగాణ) చేతిలో శరత్‌ కమల్‌ 0–3తో ఓటమిపాలయ్యాడు. 25 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో స్నేహిత్‌ 11–9, 11–8, 11–9తో విజయం సాధించాడు. 

శరత్‌ కమల్‌  చివరి మ్యాచ్‌ చూడటం కోసం నెహ్రూ స్టేడియానికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత వారందరికీ అభివాదం చేస్తూ అతను కృతజ్ఞతలు తెలిపాడు. అంతకు ముందే పురుషుల డబుల్స్‌ విభాగంలో స్నేహిత్‌తోనే కలిసి శరత్‌ డబుల్స్‌ సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడాడు. ఈ పోరులో కొరియా జోడి లిమ్‌ జాంగూన్‌ – ఆన్‌ జీహున్‌ చేతిలో 11–9, 8–11, 9–11, 6–11 స్కోరుతో శరత్‌ – స్నేహిత్‌ ఓడిపోయారు. 

17 ఏళ్ల వయసులో చెన్నైలోనే జరిగిన ఆసియా జూనియర్స్‌ టోర్నీతో తొలిసారి ప్రొఫెషనల్‌ టేబుల్‌ టెన్నిస్‌ బరిలోకి దిగిన శరత్‌ కమల్‌ రెండు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో ఎన్నో ఘనతలు సాధించాడు. అసాధారణ రీతిలో 10 సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన శరత్‌ అంతర్జాతీయ మెగా ఈవెంట్లలో పెద్ద సంఖ్యలో పతకాలు గెలుచుకున్నాడు.

కామన్వెల్త్‌ క్రీడల్లో 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు గెలిచిన అతను ఆసియా క్రీడల్లో 2 కాంస్యాలు సాధించాడు. ఆసియా చాంపియన్‌షిప్‌లో కూడా అతని ఖాతాలో 4 కాంస్యాలు ఉన్నాయి. 2004 నుంచి 2024 మధ్య ఐదు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న శరత్‌ కమల్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీ, ఖేల్‌రత్న పురస్కారాలతో గౌరవించింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)