Breaking News

అన‍్నీ ఆయనే చూసుకున్నాడు

Published on Wed, 06/25/2025 - 04:05

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌ చరిత్రలో తొలి పతకాన్ని గెలిచిన భారత మహిళా రెజ్లర్‌గా ఘనత వహించిన సాక్షి మలిక్‌ తన అంతరంగాన్ని ఆవిష్కరించింది. ఓ అథ్లెట్‌గా ఎదిగిన వైనం, తల్లిగా... భార్యగా... మారిన విధానంతో ‘గేమ్‌ ఆన్‌’ తొలి ఎపిసోడ్‌ రూపుదిద్దుకుంది. ప్రీతి దహియా హోస్ట్‌గా వ్యవహరించిన ఈ పాడ్‌కాస్ట్‌లో సాక్షి తనను తాను పరిచయం చేసుకుంది. తన రెజ్లింగ్‌ పయనం... గృహిణిగా బాధ్యతలు ఇలా పదిలమైన జ్ఞాపకాలు, మధురమైన క్షణాలు అన్ని పంచుకుంది.  

క్రికెట్‌ మతమైన దేశంలో మిగతా ఆటల్లోని ఆణిముత్యాల్ని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో సాక్షి సంగతులన్నీ ఇలా చెప్పుకొచ్చింది. ‘ప్రేమ, పెళ్లికి ముందే సత్యవర్త్‌ కడియాన్‌ ఓ రెజ్లర్‌గానే తెలుసు. 2011లో ఇ చ్చిన పుస్తకం, నేను రాసుకున్న ఊసులు, పోడియంపై ఊహించుకున్న బాసలు, రాత్రిళ్లు త్రివర్ణ పతకంతో పాటే నిదరోవడం అన్ని ఓ మెరుపు కలలు కానే కావు. నిజ జీవితంలో నిజమైన అనుభూతులు’ అని ముచ్చటగా చెప్పింది. 

రెజ్లింగ్‌లో నా అడుగులు 
‘మా కుటుంబంలో రెజ్లర్లు ఎవరూ లేరు. అలాంటి నాకు రెజ్లింగ్‌పై ఆసక్తి కలగడానికి జపాన్‌ దిగ్గజ రెజ్లర్‌ సావోరి యోషిదానే కారణం. ఓసారి విమానంలో విదేశీయానం చేసిన నాకు మూడుసార్లు ఒలింపిక్‌ చాంపియన్‌ అయిన ఆమె గురించి తెలిసింది. అప్పుడే నా కెరీరే రెజ్లింగ్‌ అయ్యింది. రెజ్లింగే తదనంతరం జీవితమైంది. 

కెనడాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నా అభిమాన రెజ్లర్‌ యోషిదాను కలుసుకోవడంతో ఆనందం రెట్టింపైంది. అప్పుడే అనుకున్న నాకు ఆడబిడ్డ పుడితే యోషిదా పేరే పెట్టాలని! చివరకు అనుకున్నట్లే భగవంతుడు కుమార్తెనే ఇచ్చాడు. నేను గట్టిగా అనుకున్న పేరే పెట్టుకున్నాను’  

ఫేస్‌బుక్‌ రిక్వెస్ట్‌తో... 
‘నేను... నా భర్త సత్యవర్త్‌ బాల్యం గడిపింది, చదివింది ఒకే చోటే అయినా కూడా ఒకరికొకరం తెలియదు. ఓ ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌తో మొదట టెక్ట్స్‌ (అక్షరాలు) కలిసింది. ఆ తర్వాతే మాట, బాట అన్ని కలిశాయి. రెజ్లింగ్‌ కెరీర్‌ కూడా ఇద్దరివి సమాంతరంగానే సాగాయి. మా క్రీడా ప్రయాణం, ప్రేమాయనం, 2014 కామన్వెల్త్‌ క్రీడల్లో పతకాల విజయం అన్ని కలిసే పయనించాయి. 

గ్లాస్గోలో రజతాలు గెలిచినపుడే సత్యవర్త్‌ ప్రేమ ప్రస్తావన తెచ్చాడు. కానీ నేనైతే ఒలింపిక్‌ పతకం వచ్చేదాకా ప్రేమపంజరంలో ఇరుక్కోనని చెప్పా. అప్పుడు నా జీవితమంతా రెజ్లింగే. నేను ఆశించినట్లే తను నా ప్రేమకై నిరీక్షించాడు. నా లక్ష్యం (రియో ఒలింపిక్‌ పతకం) సాకారమవగానే మా ప్రేమ తీరం కూడా చేరుకున్నాం’.

ప్రసవానికి ముందు రోజు కూడా...  
‘నేను నా కుమార్తెను ప్రసవించడానికి ముందు రోజు కూడా బాగా సిద్దమయ్యాను. ఎందుకంటే నేనొక అథ్లెట్‌ను. ప్రసవానంతర ఒత్తిడి నన్ను దరిచేరదని భావించా. కానీ చిత్రంగా నేను ఇంటికెళ్లగానే పది–పదిహేను రోజుల పాటు ఏడుపును ఆపుకోలేకపోయాను. నా దగ్గరే బిడ్డ వుండటం కూడా కష్టంగా ఉండేది. అసలేమి జరుగుతుందో అర్థమయ్యేది కాదు అప్పుడు. నెలలు గడిచేకొద్దీ పరిస్థితిలో మార్పొచ్చింది. 

ఇప్పుడు పాపకు ఏడు నెలలు నిండాయి. మా అందరిలో ఆమెనే బలవంతురాలని అనిపిస్తుంది. చాలా ముద్దొస్తుంది. ఎంతటి క్రీడాకారులైనా కూడా మాతృత్వపు భావోద్వేగాలకు అతీతులు కాలేరనే విషయం అప్పుడే నాకు అర్థమైంది. ఇందులో ముఖ్యంగా నా భర్త అండదండల గురించి చెప్పుకోవాలి. ఎంతో ఓపిగ్గా, మురిపెంగా పాపని నన్ను చూసుకున్నారు’.

జపనీస్‌ దిగ్గజం పేరది 
‘మా ముద్దుల పాప పేరు యోషిదా. బహుశా మేమిద్దరం రెజ్లర్లు కావడంతో పాటు నాకెంతగానో స్ఫూర్తినిచి్చన జపాన్‌ రెజ్లింగ్‌ దిగ్గజం సావోరి యోషిదా పేరే పెట్టుకున్నాం. మా బిడ్డకు అమ్మలాలన తక్కువైనా తండ్రి ప్రేమ మాత్రం అపారం. నేను ఆరోగ్యంగా ఉండేందుకు, తగినంత విశ్రాంతి తీసుకునేందుకు సత్యవర్త్‌ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. రోజూ రాత్రి 11 నుంచి తెల్లవారు జాము 3 గంటల వరకు నా భర్తే తల్లి పాత్ర పోషిస్తాడు. ఆ తర్వాత 3 నుంచి ఉదయం 8 గంటల వరకు నేను పాప సంగతి చూసుకుంటాను. ఈ సమయంలోనే సత్యవర్త్‌ విశ్రాంతి తీసుకుంటాడు’. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)