Breaking News

గట్టెక్కిన సింధు

Published on Thu, 03/07/2024 - 00:34

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ పీవీ సింధు ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సింధు 80 నిమిషాల్లో 20–22, 22–20, 21–19తో మిచెల్లి లీ (కెనడా)పై కష్టపడి గెలిచింది.

తొలి గేమ్‌ కోల్పోయి, రెండో గేమ్‌లో 7–14తో వెనుకబడిన సింధు నెమ్మదిగా పుంజుకుంది. స్కోరు 15–18 వద్ద సింధు వరుసగా ఐదు పాయింట్లు గెలిచి 20–18తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత స్కోరు 20–20తో సమమైనా... కీలకదశలో సింధు రాణించి రెండు పాయింట్లు నెగ్గి 22–20తో గేమ్‌ను దక్కించుకుంది.

నిర్ణాయక మూడో గేమ్‌ కూడా హోరాహోరీగా సాగినా కీలక తరుణంలో సింధు పైచేయి సాధించింది. పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరగా... హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. తొలి రౌండ్‌ మ్యాచ్‌లో శ్రీకాంత్‌ 21–15, 20–22, 21–8తో చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)పై నెగ్గగా... ప్రణయ్‌ 17–21, 17–21తో లు గ్వాంగ్‌ జు (చైనా) చేతిలో ఓటమి చవిచూశాడు.

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)