ఎదురులేని నీరజ్‌

Published on Sun, 07/06/2025 - 04:03

బెంగళూరు: భారత్‌లో నిర్వహించిన తొలి అంతర్జాతీయ జావెలిన్‌ త్రో ఈవెంట్‌... ‘నీరజ్‌ చోప్రా క్లాసిక్‌’లో భారత స్టార్‌ నీరజ్‌ చోప్రా విజేతగా నిలిచాడు. ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య ‘ఎ’కేటగిరీ గుర్తింపునిచ్చిన ఈ టోర్నీలో శనివారం నీరజ్‌ జావెలిన్‌ను 86.18 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఇటీవల పారిస్‌ డైమండ్‌ లీగ్, ఓస్ట్రావా గోల్డెన్‌ స్పైక్‌ టోర్నీల్లో టైటిల్స్‌ నెగ్గిన 27 ఏళ్ల నీరజ్‌ చోప్రాకు ఇది ‘హ్యాట్రిక్‌’టైటిల్‌ కావడం విశేషం. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి, 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన నీరజ్‌... సొంతగడ్డపై అంచనాలను అందుకుంటూ అదరగొట్టాడు. 

ప్రపంచ మాజీ చాంపియన్‌ జూలియన్‌ యెగో (84.51 మీటర్లు; కెన్యా), రమేశ్‌ పతిరగే (84.34 మీటర్లు; శ్రీలంక) వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య, ప్రపంచ అథ్లెటిక్స్‌ సమాఖ్య, జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో నీరజ్‌ చోప్రా పర్యవేక్షణలో జరిగిన ఈ ఈవెంట్‌ విజయవంతం కాగా... విజేతలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బహుమతులు అందజేశారు. తొలి ప్రయత్నంలో ఫౌల్‌ చేసిన నీరజ్‌... రెండో త్రోలో జావెలిన్‌ను 82.99 మీటర్ల దూరం విసిరాడు. 

ఇక మూడో ప్రయత్నంలో ఈటెను 86.18 మీటర్ల దూరం విసిరి అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసిన నీరజ్‌ విజయనాదం చేశాడు. ఆ తర్వాత నాలుగో ప్రయత్నంలో మరోసారి ఫౌల్‌ చేసిన నీరజ్‌.. ఐదో ప్రయత్నంలో 84.07 మీటర్లు, ఆరో త్రోలో 82.22 మీటర్ల దూరం నమోదు చేసుకున్నాడు. మిగిలిన అథ్లెట్లెవరూ నీరజ్‌ దరిదాపుల్లోకి చేరుకోలేకపోవ డంతో భారత స్టార్‌ విజేతగా నిలిచాడు.

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)