లక్ష్య సేన్‌ అదరహో

Published on Sun, 03/08/2026 - 03:39

బర్మింగ్‌హామ్‌: భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌  ప్రతిష్టాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్‌ లక్ష్య సేన్‌ 21–16, 18–21, 21–15తో కెనడాకు చెందిన విక్టర్‌ లాయ్‌పై తుదికంటా పోరాడి గెలిచాడు. తాజా ప్రపంచ చాంపియన్‌íÙప్‌ (పారిస్‌–2025) కాంస్య పతక విజేత అయిన విక్టర్‌ను ఓడించేందుకు లక్ష్యసేన్‌ ఏకంగా 97 నిమిషాల పాటు శ్రమించాడు. 

కాలి పాదాలు మంటపెడుతున్నా... కోర్టులో తన కదలికలతో నొప్పి మరింత పెరిగినా అన్నీ భరించి ప్రత్యర్థిని మట్టికరిపించాడు. నేడు జరిగే టైటిల్‌ పోరులో చైనీస్‌ తైపీ షట్లర్‌ లిన్‌ చున్‌ యితో లక్ష్యసేన్‌ తలపడతాడు. కాలి పాదం గాయాన్ని పంటిబిగువన భరించి సెమీస్‌లో చెమటోడ్చిన భారత షట్లర్‌ 25 ఏళ్ల తర్వాత చరిత్రలో నిలిచేందుకు ఇప్పుడు అడుగు దూరంలో నిలిచాడు. 

సుప్రసిద్ధ ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ చరిత్రలో భారత్‌ ఖాతాలో రెండే టైటిల్స్‌ ఉన్నాయి. ప్రకాశ్‌ పదుకొనె (1980), పుల్లెల గోపీచంద్‌ (2001) మాత్రమే గెలిచారు. కానీ 24 ఏళ్ల లక్ష్యసేన్‌ పుట్టాక మరో టైటిల్‌ రానేలేదు. తనే నాలుగేళ్ల క్రితం 2022లో గెలిచే ప్రయత్నం చేసినా... ఫైనల్‌ తడబాటు వల్ల చివరకు రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. అయితే అప్పటికీ ఇప్పటికీ లక్ష్యసేన్‌ ఎంతో మారాడు. అనుభవం సంపాదించాడు. నైపుణ్యం పెంచుకున్నాడు. ఇక చరిత్రకెక్కడమే తరువాయి!   

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)