Breaking News

భారత షూటర్లకు రెండు రజతాలు

Published on Mon, 04/21/2025 - 02:55

లిమా (పెరూ): అంతర్జాతీయ షూటింగ్‌ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌) రెండో ప్రపంచకప్‌ టోర్నమెంట్‌లో భారత షూటర్ల నిలకడైన ప్రదర్శన కొనసాగుతోంది. ఆదివారం భారత షూటర్లు రెండు రజత పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో అర్జున్‌ బబూటా... 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో రుద్రాంక్ష్  పాటిల్‌–ఆర్య బోర్సె రజత పతకాలు సాధించారు. 

ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఫైనల్లో అర్జున్‌ బబూటా 252.3 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచాడు. 253.4 పాయింట్లతో చైనా షూటర్‌ షెంగ్‌ లిహావో స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. పెనీ మార్టన్‌ (హంగేరి; 229.8 పాయింట్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. 

ఫైనల్‌కు చేరిన మరో భారత షూటర్‌ రుద్రాంక్ష్  పాటిల్‌ 104.8 పాయింట్లతో చివరిదైన ఎనిమిదో స్థానంలో నిలిచాడు. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ ఫైనల్లో రుద్రాంక్ష్  పాటిల్‌–ఆర్య ద్వయం 11–17తో జెనెట్‌ హెగ్‌–జాన్‌ హెర్మన్‌ హెగ్‌ (నార్వే) జంట చేతిలో ఓడిపోయింది. సోమవారంతో ముగియనున్న ఈ టోర్నీలో ప్రస్తుతం భారత్‌ రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యంతో కలిపి ఆరు పతకాలతో మూడో స్థానంలో ఉంది. 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)