Breaking News

దేవిక ధమాకా

Published on Mon, 02/02/2026 - 02:26

బ్యాంకాక్‌: అంచనాలకు మించి రాణించిన భారత రైజింగ్‌ స్టార్‌ షట్లర్‌ దేవిక సిహాగ్‌ తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని అందుకుంది. ఆదివారం ముగిసిన థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో దేవిక చాంపియన్‌గా అవతరించింది. హరియాణాకు చెందిన 20 ఏళ్ల దేవిక కెరీర్‌లో ఇదే తొలి సూపర్‌–300 టైటిల్‌ కావడం విశేషం. 

ప్రపంచ 68వ ర్యాంకర్, రెండుసార్లు జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌ గో జిన్‌ వె (మలేసియా)తో జరిగిన ఫైనల్లో దేవిక తొలి గేమ్‌ను 21–8తో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో 6–3తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో గాయం కారణంగా గో జిన్‌ వె మ్యాచ్‌ నుంచి వైదొలిగింది. దాంతో దేవికకు టైటిల్‌ ఖరారైంది. విజేత దేవికకు 18,750 డాలర్ల (రూ. 17 లక్షల 19 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7000 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. 

పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ తర్వాత థాయ్‌లాండ్‌ సూపర్‌–300 టైటిల్‌ నెగ్గిన మూడో భారతీయ క్రీడాకారిణిగా దేవిక గుర్తింపు పొందింది. టైటిల్‌ గెలిచే క్రమంలో దేవిక తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్‌ కూడా కోల్పోకపోవడం విశేషం. ఈ టైటిల్‌తో ప్రపంచ 63వ ర్యాంకర్‌ దేవిక మంగళవారం విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌–40లో చోటు సంపాదిస్తుంది.  ‘చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో ఇదే తొలి సూపర్‌–300 లెవెల్‌ టైటిల్‌. 

ఈ సీజన్‌లో మరిన్ని టోర్నీలు ఆడతాను. థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో అన్ని మ్యాచ్‌లు బాగా ఆడాను. కొత్త పాఠాలు నేర్చుకున్నాను. ఫైనల్లో గెలుపోటములు గురించి ఆలోచించలేదు. నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతో బరిలోకి దిగాను’ అని దేవిక వ్యాఖ్యానించింది. బెంగళూరులోని పదుకొనే–ద్రవిడ్‌ సెంటర్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ ఎక్స్‌లెక్స్‌లో ఉమేంద్ర రాణా వద్ద దేవిక శిక్షణ తీసుకుంటోంది.   

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)