Breaking News

వెన్నెల, జ్ఞానదత్తు శుభారంభం

Published on Tue, 10/14/2025 - 04:25

గువాహటి: సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌ వ్యక్తిగత విభాగంలో భారత క్రీడాకారులు శుభారంభం చేశారు. భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌ క్రీడాకారులు టంకర తలశిల జ్ఞానదత్తు, కలగోట్ల వెన్నెల తొలి రౌండ్‌లో విజయాలు సాధించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. 

పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో 17 ఏళ్ల జ్ఞానదత్తు 5–15, 15–7, 15–7తో మిలాన్‌ మెస్టెర్‌హాజి (హంగేరి)పై... మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో వెన్నెల 15–1, 15–6తో సియోఫ్రా ఫ్లిన్‌ (ఐర్లాండ్‌)పై గెలుపొందారు. ‘నేను తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్నాను. దాంతో తొలి గేమ్‌లో కాస్త ఒత్తిడికి గురయ్యా. యూరోప్‌ ప్లేయర్‌తో రెండోసారి తలపడ్డా. దాంతో యూరోప్‌ ఆటగాళ్ల ఆటతీరును అర్ధం చేసుకోవడానికి కాస్త సమయం తీసుకున్నా. 

రెండో గేమ్‌ నుంచి నేను సహజశైలిలో ఆడి విజయాన్ని అందుకున్నా’ అని ఈ మెగా ఈవెంట్‌లో టీమ్‌ విభాగంలో తొలిసారి కాంస్యం గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న జ్ఞానదత్తు వ్యాఖ్యానించాడు. మరోవైపు మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో హైదరాబాద్‌కే చెందిన కోడె విష్ణుకేదార్‌–మంచాల కీర్తి ద్వయం కూడా గెలుపు బోణీ కొట్టింది. తొలి రౌండ్‌లో విష్ణు–కీర్తి జోడీ 15–7, 15–8తో మొస్లెనా కొరామా–ఒబపోంబా అదుమింటా (ఘనా) జంటపై గెలిచింది. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)