Breaking News

అర్జున్‌కు కాంస్యం

Published on Wed, 12/31/2025 - 02:16

దోహా: ‘ఫిడే’ వరల్డ్‌ చెస్‌ చాంపియన్‌ షిప్‌ ర్యాపిడ్‌ విభాగంలో మూడో స్థానం సాధించిన భారత ఆటగాడు, తెలంగాణకు చెందిన అర్జున్‌ ఇరిగేశికి బ్లిట్జ్‌ విభాగంలోనూ కాంస్య పతకం దక్కింది. మంగళవారం జరిగిన బ్లిట్జ్‌ ఈవెంట్‌ తొలి సెమీ ఫైనల్లో అర్జున్‌ 0.5–2.5 తేడాతో అబ్దుస్సత్తొరొవ్‌ నొదిర్‌బెక్‌ (ఉజ్బెకిస్తాన్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. దాంతో ఈ మెగా టోర్నీలో అర్జున్‌ రెండో కాంస్యానికి పరిమితమయ్యాడు. 

విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ఒకే వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ రెండు విభాగాల్లో (ర్యాపిడ్, బ్లిట్జ్‌) పతకాలు సాధించిన రెండో భారత ఆటగాడిగా అర్జున్‌ నిలవడం విశేషం. సత్తొరొవ్‌తో జరిగిన పోరులో తొలి రెండు గేమ్‌లలో అర్జున్‌ వరుసగా 47 ఎత్తుల్లో, 83 ఎత్తుల్లో పరాజయంపాలయ్యాడు. 

తప్పనిసరిగా నెగ్గాల్సిన మూడో గేమ్‌ 33 ఎత్తుల తర్వాత ‘డ్రా’గా ముగిసింది. దాంతో నాలుగో గేమ్‌ నిర్వహించాల్సిన అవసరం లేకుండానే అర్జున్‌ ఓటమి ఖాయమైంది. రెండో సెమీఫైనల్లో కార్ల్‌సన్‌ చేతిలో 1–3తో ఫాబియానో కరువానా (అమెరికా) ఓటమిపాలయ్యాడు. టోర్నీ నిబంధనల ప్రకారం సెమీస్‌లో ఓడిన అర్జున్, కరువానాలిద్దరికీ కాంస్యం అందించారు. 

వీరిద్దరికి చెరో 28 వేల యూరోలు (సుమారు రూ.30 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. సెమీస్‌ టైబ్రేక్‌కు ముందు జరిగిన రెగ్యులర్‌ రౌండ్లలో అర్జున్‌ 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఆడిన 19 రౌండ్లలో 12 గెలిచి 6 డ్రా చేసుకొని ఒకటి మాత్రమే ఓడిన అర్జున్‌ నంబర్‌వన్‌గా ముగించాడు. అర్జున్‌తో పాటు టాప్‌–4లో నిలిచిన కరువానా (14), కార్ల్‌సన్‌ (13.5), అబ్దుస్సత్తొరొవ్‌ (13) సెమీ ఫైనల్‌కు అర్హత సాధించారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)