Breaking News

క్వార్టర్స్‌లో సాకేత్‌–రామ్‌ జోడీ

Published on Thu, 02/27/2025 - 03:52

బెంగళూరు: వరుస సెట్‌లలో గెలిచిన భారత జోడీ సాకేత్‌ మైనేని–రామ్‌కుమార్‌ రామనాథన్‌ బెంగళూరు ఓపెన్‌ ఏటీపీ–125 చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాకేత్‌–రామ్‌ ద్వయం 6–3, 7–6 (7/4)తో జాకోపో బెరెటిని–ఎన్రికో డల్లా వాలె (ఇటలీ) జంటను ఓడించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సాకేత్‌–రామ్‌ జోడీ తొమ్మిది ఏస్‌లు సంధించి, ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేసింది. 

ఇతర తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో టాప్‌ సీడ్‌ అనిరుధ్‌ చంద్రశేఖర్‌ (భారత్‌)–రే హో (చైనీస్‌ తైపీ) 6–4, 6–4తో గంటా సాయికార్తీక్‌ రెడ్డి (భారత్‌)–సుల్తానోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)లపై, సిద్ధాంత్‌–పరీక్షిత్‌ సొమాని (భారత్‌) 6–4, 6–3తో నికీ కలియంద పునాచా (భారత్‌)–జాన్‌ లాక్‌ (జింబాబ్వే)లపై, ప్రజ్వల్‌ దేవ్‌–ఆర్యన్‌ షా (భారత్‌) 4–6, 6–3, 10–6తో ఎంజో కుకాడో (ఫ్రాన్స్‌)–మైకేల్‌ గీర్ట్స్‌ (బెల్జియం)లపై, ఆదిల్‌ కల్యాణ్‌పూర్‌–కరణ్‌ సింగ్‌ (భారత్‌) 1–6, 6–2, 10–4తో నితిన్‌ కుమార్‌ సిన్హా–మనీశ్‌ సురేశ్‌కుమార్‌ (భారత్‌)లపై గెలిచి క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టారు.  

 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)