Breaking News

వరుసగా మూడోసారి భారత పురుషుల టీటీ జట్టుకు పతకం ఖరారు

Published on Thu, 10/10/2024 - 03:48

ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత పురుషుల జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 3–1తో ఆతిథ్య కజకిస్తాన్‌ జట్టుపై గెలిచింది. 2021, 2023 ఆసియా టీటీ టోర్నీల్లో భారత జట్టు సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు సాధించింది. 

కజకిస్తాన్‌తో జరిగిన పోరులో తొలి మ్యాచ్‌లో మానవ్‌ 11–9, 11–7, 11–6తో గెరాసిమెంకోపై నెగ్గాడు. రెండో మ్యాచ్‌లో కుర్మంలియెవ్‌ 11–6, 11–5, 11–8తో హర్మత్‌ దేశాయ్‌ను ఓడించాడు. మూడో మ్యాచ్‌లో శరత్‌ కమల్‌ 11–4, 11–7, 12–10తో కెంజిగులోవ్‌పై గెలిచాడు. 

నాలుగో మ్యాచ్‌లో హర్మీత్‌ దేశాయ్‌ 6–11, 11–9, 7–11, 11–8, 11–8తో గెరాసిమెంకోను ఓడించడంతో భారత్‌ 3–1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో చైనీస్‌ తైపీతో భారత్‌ ఆడుతుంది. మరోవైపు భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 1–3తో జపాన్‌ చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.    

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)