Breaking News

భారత్‌ను ఆదుకున్న మన్‌దీప్‌

Published on Thu, 09/04/2025 - 04:09

రాజ్‌గిర్‌ (బిహార్‌): లీగ్‌ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత పురుషుల హాకీ జట్టుకు ఆసియా కప్‌లో తొలిసారి గట్టిపోటీ ఎదురైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ దక్షిణ కొరియా జట్టుతో బుధవారం జరిగిన ‘సూపర్‌–4’ దశ మ్యాచ్‌ను భారత్‌ 2–2 గోల్స్‌తో ‘డ్రా’గా ముగించింది. మ్యాచ్‌ ముగియడానికి ఏడు నిమిషాలు ఉన్నాయనగా మన్‌దీప్‌ సింగ్‌ గోల్‌ చేసి భారత్‌ను ఓటమి బారి నుంచి తప్పించాడు. గోల్స్‌ చేసేందుకు వచ్చిన పలు అవకాశాలను వృథా చేసుకున్న భారత జట్టు చివరకు విజయం బదులు ‘డ్రా’తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఎనిమిదో నిమిషంలో హార్దిక్‌ సింగ్‌ చేసిన గోల్‌తో భారత్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే కొరియా జట్టు రెండు నిమిషాల తేడాలో రెండు గోల్స్‌ చేసి భారత్‌కు షాక్‌ ఇచి్చంది. 12వ నిమిషంలో జిహున్‌ యాంగ్‌ గోల్‌తో స్కోరును 1–1తో సమం చేసిన కొరియా... 14వ నిమిషంలో హైయోన్‌హాంగ్‌ కిమ్‌ గోల్‌తో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. 

ఒకదశలో భారత్‌కు ఓటమి తప్పదేమోనని అనిపించినా... 53వ నిమిషంలో మన్‌దీప్‌ సింగ్‌ గోల్‌ చేసి భారత్‌ను ఆదుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ తమకు లభించినా ఆరు పెనాల్టీ కార్నర్‌లను వృథా చేసుకుంది. అంతకుముందు చైనాతో జరిగిన మరో ‘సూపర్‌–4’ మ్యాచ్‌లో మలేసియా 2–0తో గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో కొరియాతో  చైనా; మలేసియాతో భారత్‌ తలపడతాయి.   

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)