Breaking News

భళా భారత్‌

Published on Sun, 02/23/2025 - 03:58

భువనేశ్వర్‌: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ప్రొ లీగ్‌లో భారత పురుషుల జట్టు విజయ పరంపర కొనసాగుతోంది. శనివారం జరిగిన పోరులో టీమిండియా 4–0 గోల్స్‌ తేడాతో ఐర్లాండ్‌ జట్టుపై విజయం సాధించింది. శుక్రవారం 3–1 గోల్స్‌ తేడాతో ఐర్లాండ్‌ను ఓడించిన భారత్‌... వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆధిపత్యం కనబర్చింది. భారత్‌ తరఫున నీలమ్‌ సంజీప్‌ (14వ నిమిషంలో), మన్‌దీప్‌ సింగ్‌ (24వ నిమిషంలో), అభిõÙక్‌ (28వ నిమిషంలో), శంషేర్‌ సింగ్‌ (34వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. 

మ్యాచ్‌ ఆరంభంలో చక్కటి ఆటతీరు కనబర్చిన ఐర్లాండ్‌ 9వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్‌ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోలేకపోయింది. ఇక అక్కడి నుంచి భారత్‌ జోరు ప్రారంభమైంది. వరుస విరామాల్లో గోల్స్‌ కొట్టిన భారత్‌ ఆధిక్యం అంతకంతకూ పెంచుకుంటూ పోయింది. నీలమ్‌ 14వ నిమిషంలో ఫీల్డ్‌గోల్‌తో భారత్‌ ఖాతా తెరవగా... ఆ తర్వాత మన్‌దీప్, అభిõÙక్, శంషేర్‌ తలా ఒక గోల్‌ కొట్టారు. 

మ్యాచ్‌లో భారత్‌కు మరిన్ని పెనాల్టీ కార్నర్‌ అవకాశాలు లభించినా... రెగ్యులర్‌ కెప్టెన్, స్టార్‌ డ్రాగ్‌ఫ్లికర్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ విశ్రాంతి తీసుకోవడంతో మన అధిక్యం మరింత పెరగలేదు. చివరి క్వార్టర్‌లో ప్రత్యర్థి ప్లేయర్లు మన రక్షణ పంక్తిని దాటి ముందుకు సాగలేకపోయారు. తదుపరి మ్యాచ్‌లో సోమవారం ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడుతుంది.  

దీపిక గోల్‌తో భారత్‌ గెలుపు 
మరో వైపు మహిళల విభాగంలో భారత జట్టు శనివారం 1–0 గోల్స్‌ తేడాతో జర్మనీపై విజయం సాధించింది. శుక్రవారం తొలి పోరులో 0–4 గోల్స్‌ తేడాతో జర్మనీ చేతిలో ఓడిన భారత్‌... రెండో మ్యాచ్‌లో దానికి బదులు తీర్చుకుంది. భారత్‌ తరఫున స్టార్‌ డ్రాగ్‌ఫ్లికర్‌ దీపిక (12వ నిమిషంలో) ఏకైక గోల్‌ చేసింది. 

పెనాల్టీ కార్నర్‌ను సమర్థవంతంగా ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లోకి పంపి జట్టుకు ఆధిక్యాన్ని అందించింది. ఆ తర్వాత ఇరు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్‌ సాధ్య పడలేదు. ఫలితంగా భారత్‌ విజయం సాధించింది. తదుపరి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత అమ్మాయిల జట్టు మ్యాచ్‌ ఆడుతుంది.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)