Breaking News

కాంస్య‌ ప‌త‌కంతో వీడ్కోలు ప‌లికిన భార‌త హాకీ లెజెండ్‌...

Published on Fri, 08/09/2024 - 10:04

ప్యారిస్ ఒలింపిక్స్‌-2024లో భార‌త హాకీ జ‌ట్టు అద్భుతం చేసింది. ఈ విశ్వ క్రీడ‌ల్లో వ‌రుస‌గా రెండోసారి కాంస్య ప‌త‌కాన్ని భార‌త హాకీ జ‌ట్టు సొంతం చేసుకుంది. సెమీస్‌లో జర్మనీ చేతిలో పోరాడి ఓడిన టీమిండియా.. స్పెయిన్‌తో కాంస్య పతక పోరులో మాత్రం స‌త్తాచాటింది. 

2-1 తేడాతో స్పెయిన్ ఓడించిన భార‌త జ‌ట్టు కాంస్య ప‌త‌కాన్ని ముద్దాడింది. ఇక ఈ చిరస్మ‌ర‌ణీయ విజ‌యంతో భార‌త స్టార్ గోల్ కీప‌ర్‌ పీఆర్‌ శ్రీజేశ్ త‌న 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు విడ్కోలు ప‌లికాడు. కాగా తన రిటైర్మెంట్‌ విషయాన్ని ఒలింపిక్స్‌ ఆరంభానికి ముందే శ్రీజేశ్‌ ప్రకటించాడు.

ఈ క్రమంలో తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడిన పీఆర్ శ్రీజేష్‌కు సహచర ఆటగాళ్లు ఘన వీడ్కోలు పలికారు. ఆటగాళ్లంతా శ్రీజేష్‌కు స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. తమ భుజాలపై ఎత్తుకొని గోల్ పోస్ట్‌ పోల్‌పై కూర్చోబెట్టారు. తమ హాకీ స్టిక్స్‌తో జేజేలు కొట్టారు.

 కాగా భార‌త్ కాంస్య ప‌త‌కం సాధించ‌డంలో శ్రీజేష్‌ది కీల‌క పాత్ర‌. ముఖ్యంగా బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రీజేష్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కోట గోడలా నిలిచిన శ్రీజేష్‌ బ్రిటన్‌కు ఎక్స్‌ట్రా గోల్‌ చేసే ఛాన్స్‌ ఇవ్వలేదు.

ఇక 2006లో సౌత్ ఆసియన్ గేమ్స్‌తో అరంగేట్రం చేసిన శ్రీజేష్‌.. ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. కెప్టెన్‌గా, గోల్‌కీపర్‌గా భారత్‌కు చిరస్మరణీయ విజయాలను అందించాడు. రియో ఒలింపిక్స్‌లో భారత జట్టుకు శ్రీజేష్ సారథ్యం వహించాడు.

2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన భారత హారీ జట్టులో శ్రీజేష్ సభ్యునిగా ఉన్నాడు. ఇది శ్రేజేష్‌కు నాలుగో ఒలింపిక్స్ కావడం గమనార్హం.  అతడి కెరీర్‌లో రెండు ఆసియా గేమ్స్ బంగారు పతకాలు, రెండు ఆసియా కప్ టైటిల్స్, నాలుగు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ కూడా ఉన్నాయి. 2021లో శ్రేజేష్ 2021లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును అందుకున్నాడు.

"నా ఆటను ముగించేందుకు ఇంతకంటే సరైన సమయం ఉండదు. మేం పతకంతో తిరిగి వెళుతున్నాం. కొందరు అభిమానులు నన్ను కొనసాగించమని కోరుతున్నారు. కానీ నా నిర్ణయంలో మార్పు లేదు. కొన్ని నిర్ణయాలు కఠినమైనవే అయినా వాటిని సరైన సమయంలో తీసుకోవడమే బాగుంటుంది. మా జట్టు సభ్యులంతా చాలా బాగా ఆడారు. 

టోక్యోలో గెలిచిన కాంస్యానికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఒలింపిక్స్‌లో మేం పతకం గెలవగలమనే నమ్మకాన్ని అది కల్పించిందని" తన రిటైర్మెంట్‌ ప్రకటనలో శ్రీజేష్‌ పేర్కొన్నాడు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)