Breaking News

‘ఒలింపిక్‌ పతకం గెలిచుంటే బాగుండేది’

Published on Wed, 04/02/2025 - 03:32

న్యూఢిల్లీ: ఏ ఆటలోనైనా... ఏ స్థాయి ప్లేయర్‌కైనా... అంతిమ లక్ష్యం ఒలింపిక్‌ పతకం సాధించడమే... అయితే అందరికీ ఒలింపిక్‌ పతకాన్ని అందుకునే భాగ్యం ఉండదు. ఎంత సత్తా ఉన్నా... జట్టు క్రీడలో సమన్వయం కొరవడితే ఫలితాలు తారుమారు అవుతాయి... లక్ష్యానికి చేరువై దూరమైపోతారు. భారత సీనియర్‌ హాకీ స్టార్‌ వందన కటారియా కెరీర్‌లోనూ ఇలాగే జరిగింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో వందన సభ్యురాలిగా ఉన్న భారత జట్టు త్రుటిలో కాంస్య పతకాన్ని కోల్పోయింది. బ్రిటన్‌ జట్టుతో జరిగిన కాంస్య పతక మ్యాచ్‌లో టీమిండియా 3–4 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది. ఈ కీలక మ్యాచ్‌లో వందన ఒక గోల్‌ కూడా చేసింది. 

అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో వందన ‘హ్యాట్రిక్‌’ కూడా సాధించింది. మంగళవారం అంతర్జాతీయ హాకీకి గుడ్‌బై చెప్పిన వందన తన కెరీర్‌లో ఒలింపిక్‌ పతకం లేకపోవడం లోటుగా ఉండిపోతుందని, టోక్యోలో కాంస్యం సాధించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించింది. ‘నేను హరిద్వార్‌లో హాకీ స్టిక్‌ పట్టుకునే సమయానికి ఆడపిల్లలు ఇంటి గడప దాటకూడదనే అభిప్రాయం ఉండేది. వందనను హాకీ ఆడేందుకు ఇంటి బయటకు ఎందుకు పంపిస్తున్నావని మా నాన్నను ఇంటి చుట్టుపక్కల వాళ్లు చాలాసార్లు ప్రశ్నించారు. 

కానీ వారి మాటలను ఆయన పట్టించుకోలేదు. నాకంటే ముందుగానే మా ఇద్దరు అక్కలు రీనా, అంజలి హాకీ ఆడేవారు. నేను ఖోఖోను ఎక్కువ ఇష్టపడేదాన్ని. కొన్ని రోజులు గడిచాక నేను కూడా హాకీవైపు మళ్లాను. మాకెంతో మద్దతు ఇచ్చిన నాన్న టోక్యో ఒలింపిక్స్‌కు కొన్ని రోజుల ముందు కన్ను మూశారు. నాన్న మరణం నన్ను కుంగదీసినా కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ఆత్మవిశ్వాసంతో టోక్యోకు వెళ్లాను. కుటుంబసభ్యుల మద్దతు ఉంటే ఏ రంగంలోనైనా అనుకున్నది సాధించడం సాధ్యమే’ అని 32 ఏళ్ల వందన తెలిపింది. 

‘అంతర్జాతీయ హాకీకి వీడ్కోలు పలకాలన్న నిర్ణయం హఠాత్తుగా తీసుకోలేదు. చాలా మంది జూనియర్‌ ప్లేయర్లు తెరపైకి వస్తున్నారు. ఇప్పటికే 15 ఏళ్లుగా భారత జట్టుకు ఆడుతున్నాను. జూనియర్లకు కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయం తీసుకున్నాను’ అని వందన వ్యాఖ్యానించింది. ఇప్పటికిప్పుడు భవిష్యత్‌ ప్రణాళికల గురించి ఆలోచించలేదని... అయితే తనకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన హాకీకి తప్పకుండా సేవలు అందిస్తానని వందన తెలిపింది.

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)