Breaking News

గట్టెక్కిన ప్రజ్ఞానంద

Published on Fri, 11/07/2025 - 03:20

పనాజీ: ప్రపంచకప్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్, ప్రపంచ ఏడో ర్యాంకర్‌ ప్రజ్ఞానంద మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. తెమూర్‌ కుయ్‌»ొకరోవ్‌ (ఆ్రస్టేలియా)తో గురువారం జరిగిన ‘టైబ్రేక్‌’లో ప్రజ్ఞానంద 4–2తో విజయం సాధించాడు. వీరిద్దరి మధ్య నిర్ణీత రెండు క్లాసికల్‌ గేమ్‌లు ‘డ్రా’ కావడంతో విజేతను నిర్ణయిచేందుకు టైబ్రేక్‌ను నిర్వహించారు. 

నిబంధనల ప్రకారం ముందుగా 15 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్‌ గేమ్‌లు నిర్వహించారు. ఈ రెండు గేమ్‌లు ‘డ్రా’గా ముగియడంతో స్కోరు 1–1తో సమమైంది. దాంతో ఫలితం తేలేందుకు ఈసారి 10 నిమిషాల నిడివిగల మరో రెండు గేమ్‌లు ఆడించారు. తొలి గేమ్‌లో ప్రజ్ఞానంద 38 ఎత్తుల్లో ఓడిపోయాడు. బరిలో నిలవాలంటే రెండో గేమ్‌లో ప్రజ్ఞానంద తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ప్రజ్ఞానంద 31 ఎత్తుల్లో తెమూర్‌ను ఓడించడంతో స్కోరు 2–2తో సమమైంది. దాంతో ఈసారి 5 నిమిషాల నిడివిగల రెండు గేమ్‌లు ఆడించారు. తొలి గేమ్‌లో ప్రజ్ఞానంద 46 ఎత్తుల్లో గెలుపొంది 3–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అనంతరం రెండో గేమ్‌లో ప్రజ్ఞానంద 41 ఎత్తుల్లో నెగ్గి 4–2తో  విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. 

భారత్‌కే చెందిన విదిత్, నారాయణన్, ప్రాణేశ్, ప్రణవ్‌ కూడా మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లగా... నిహాల్‌ సరీన్, కార్తికేయన్‌ మురళీలకు నిరాశ ఎదురైంది. టైబ్రేక్‌లో విదిత్‌ 1.5–0.5తో ఫౌస్టోనో (అర్జెంటీనా)పై, నారాయణన్‌ 4–2తో వితియుగోవ్‌ (ఇంగ్లండ్‌)పై, ప్రాణేశ్‌ 2–0తోదిమిత్రిజ్‌ (జర్మనీ)పై, ప్రణవ్‌ 2–0తో తారి ఆర్యన్‌ (నార్వే)పై విజయం సాధించారు. 

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)