Breaking News

విదిత్‌ సంచలనం

Published on Tue, 08/15/2023 - 06:11

బకూ (అజర్‌బైజాన్‌): ప్రపంచకప్‌ చెస్‌ టోర్నీ ఓపెన్‌ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్‌ విదిత్‌ సంతోష్‌ గుజరాతి సంచలనం సృష్టించాడు. ప్రపంచ ఐదో ర్యాంకర్, రష్యా గ్రాండ్‌మాస్టర్‌ ఇయాన్‌ నిపోమ్‌ని షితో జరిగిన ప్రిక్వార్టర్‌ ఫైనల్లో విదిత్‌ 4–2తో నెగ్గి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. నిర్ణీత రెండు క్లాసికల్‌ గేమ్‌ల తర్వాత ఇద్దరూ 1–1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు సోమవారం ర్యాపిడ్‌ ఫార్మాట్‌లో టైబ్రేక్‌ గేమ్‌లు నిర్వహించారు.

ముందుగా 25 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్‌ గేమ్‌లను ఆడించగా ఈ రెండూ ‘డ్రా’గా ముగిశాయి. దాంతో స్కోరు 2–2తో సమమైంది. అనంతరం 10 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్‌ గేమ్‌లను ఆడించారు. ఈ రెండింటిలో విదిత్‌ గెలుపొందడం విశేషం. తొలి గేమ్‌లో 60 ఎత్తుల్లో గెలిచిన విదిత్‌ రెండో గేమ్‌లో 52 ఎత్తుల్లో నెగ్గాడు. దాంతో విదిత్‌కు క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ ఖరారైంది. ఈ టోర్నీలో నాలుగో భారత ప్లేయర్‌ క్వార్టర్‌ ఫైనల్‌ చేరాడు. ఇప్పటికే ఇరిగేశి అర్జున్, దొమ్మరాజు గుకేశ్, ప్రజ్ఞానంద క్వార్టర్‌ ఫైనల్‌ చేరారు. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్స్‌ తొలి గేమ్‌లలో కార్ల్‌సన్‌ (నార్వే)తో గుకేశ్‌; నిజాత్‌ అబసోవ్‌ (అజర్‌బైజాన్‌)తో విదిత్‌; ప్రజ్ఞానందతో అర్జున్‌; కరువానా (అమెరికా)తో లీనియర్‌ (అమెరికా) తలపడతారు.

హారిక ఓటమి
మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక పోరాటం ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్లో హారిక 3.5–4.5తో అలెగ్జాండ్రా గోర్యాచ్‌కినా (రష్యా) చేతిలో ఓడిపోయింది. వీరిద్దరి మధ్య
రెండు క్లాసికల్‌ గేమ్‌లు ‘డ్రా’గా ముగియడంతో విజేతను నిర్ణయించేందుకు ర్యాపిడ్‌ ఫార్మాట్‌లో టైబ్రేక్‌ గేమ్‌లు నిర్వహించారు. తొలి గేమ్‌లో గోర్యాచ్‌కినా, రెండో గేమ్‌లో హారిక గెలిచారు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. అనంతరం నిర్వహించిన రెండు గేమ్‌లు ‘డ్రా’ కావడంతో స్కోరు 3–3తో సమమైంది. ఈసారి రెండు గేమ్‌లు నిర్వహించగా... తొలి గేమ్‌లో గోర్యాచ్‌కినా 43 ఎత్తుల్లో గెలిచి, రెండో గేమ్‌ను 95 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకొని సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)