Breaking News

తొలిసారి కూతురు సమక్షంలో...

Published on Thu, 08/07/2025 - 04:17

చెన్నై: కూతురు సమక్షంలో టైటిల్‌ సాధించడమే తన లక్ష్యమని చెన్నై గ్రాండ్‌ మాస్టర్స్‌–2025 టోర్నమెంట్‌... చాలెంజర్స్‌ విభాగంలో బరిలోకి దిగుతున్న భారత గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక వెల్లడించింది. పాపకు జన్మనిచ్చిన తర్వాత... స్వదేశంలో తొలిసారి ఓ పెద్ద టోర్నీ ఆడుతుండటం ఆనందంగా ఉందని హారిక పేర్కొంది. రెండేళ్ల హన్వికను వదిలి విదేశాల్లో టోర్నీలు ఆడటం కష్టంగా ఉండేదని... ఇప్పుడు చెన్నైలోనే పోటీలు జరుగుతుండటంతో కుటుంబంతో కలిసి పాల్గొంటున్నట్లు వెల్లడించింది. 

‘ఇంటికి దగ్గరగా ఆడుతుండటం చాలా ఆనందంగా ఉంది. పాపతో కలిసి ఓ టోర్నీకి రావడం ఇదే తొలిసారి. నా క్రీడా జీవితంలో ఇప్పుడు తను కూడా ఒక భాగం కానుంది. కూతురు సమక్షంలో మ్యాచ్‌లు ఆడనుండటం చాలా ఉద్వేగంగా ఉంది. తల్లి అయిన తర్వాత పాపను వదిలి ఉండటం ఎంత కష్టమో తెలిసొచ్చింది. పాపను ఇంట్లో వదిలి టోర్నీల్లో పాల్గొనేందుకు వెళ్లిన ప్రతిసారీ ఎంతో బాధపడేదాన్ని. వెంట తీసుకెళ్లాలని ఎంతో అనిపించేది. కానీ, అక్కడి పరిస్థితులు, వాతావరణం, ఆహారం వల్ల ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయేమోనని వెనకడుగు వేసేదాన్ని’ అని హారిక చెప్పుకొచ్చింది. 

ప్రస్తుత భారత చెస్‌ బృందంలో చిన్నపిల్లలతో గడపడంలో ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ అత్యుత్తమమని హారిక కితాబిచ్చింది. ‘గుకేశ్‌ పిల్లలను బాగా హ్యాండిల్‌ చేస్తాడు. అతడు మంచి ‘బేబీ సిట్టర్‌’. ఢిల్లీలో ఒకసారి అతడు చిన్న పిల్లలతో మమేకమైన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నా వల్ల కూడా అలా సాధ్యం కాదేమో’ అని హారిక చెప్పింది. జార్జియాలో ఇటీవల జరిగిన మహిళల ప్రపంచకప్‌ టోర్నీ క్వార్టర్‌ ఫైనల్‌ ‘టైబ్రేక్‌’లో దివ్య దేశ్‌ముఖ్‌ చేతిలో పరాజయం పాలైన హారిక... ఆ పరాజయాన్ని పక్కన పెట్టి చెన్నైలో తిరిగి సత్తా చాటుతానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)