Breaking News

భారత గోల్ఫర్‌ అదితికి 29వ స్థానం

Published on Sun, 08/11/2024 - 04:11

మూడేళ్ల క్రితం టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో కాంస్య పతకం కోల్పోయిన భారత మహిళా గోల్ఫర్‌ అదితి అశోక్‌ ‘పారిస్‌’ క్రీడల్లో ప్రభావం చూపలేకపోయింది. మహిళల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లేలో అదితి 290 పాయింట్లతో 29వ స్థానంతో సరిపెట్టుకుంది. తొలి మూడు రోజులు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన అదితి... పోటీల చివరి రోజు శనివారం మెరుగైన ప్రదర్శన కనబర్చింది. 11 స్థానాలు మెరుగు పర్చుకుంది. 

భారత్‌కే చెందిన మరో గోల్ఫర్‌ దీక్ష డాగర్‌ 301 పాయింట్లతో 49వ స్థానంతో సరిపెట్టుకుంది. న్యూజిలాండ్‌ గోల్ఫర్‌ లిడియా కో 278 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా... ఎస్తెర్‌ హెన్సెలైట్‌ (280 పాయింట్లు; జర్మనీ), లిన్‌ జియా జానెట్‌ (281 పాయింట్లు; చైనా) వరసగా రజత, కాంస్యాలు దక్కించుకున్నారు. 

‘తొలి మూడు రోజులు సరైన షాట్‌లు ఆడలేకపోయా. అందుకే వెనుకబడ్డా.. చివర్లో పుంజుకున్నా అప్పటికే ఆలస్యమైంది. 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో మరింత మెరుగైన ప్రదర్శనతో పతకం సాధించేందుకు ప్రయత్నిస్తా’ అని అదితి పేర్కొంది.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)