142వ ర్యాంక్‌లో భారత్‌

Published on Fri, 11/21/2025 - 03:49

న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో పేలవ ప్రదర్శన కనబరుస్తున్న భారత ఫుట్‌బాల్‌ జట్టు ‘ఫిఫా’ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మరింత వెనుకబడింది. ఆసియా కప్‌ క్వాలిఫయర్స్‌లో భాగంగా ఇటీవల బంగ్లాదేశ్‌ చేతిలో 0–1 గోల్స్‌ తేడాతో ఓడిన టీమిండియా ఆరు స్థానాలు కోల్పోయి 142వ ర్యాంక్‌తో సరిపెట్టుకుంది. ఆసియా కప్‌నకు అర్హత సాధించే అవకాశం కోల్పోయిన భారత జట్టుకు గత తొమ్మిదేళ్లలో ఇదే చెత్త ర్యాంక్‌. 

చివరిసారిగా 2016 అక్టోబర్‌లో 148వ ర్యాంక్‌లో నిలిచిన భారత్‌ జట్టుకు ఆ తర్వాత ఇదే అత్యధిక ర్యాంక్‌. 2023 డిసెంబర్‌లో 102వ స్థానంలో ఉన్న టీమిండియా... వరుస పరాజయాల కారణంగా 40 స్థానాలు దిగజారింది. ఆసియా ర్యాంకింగ్స్‌లో భారత్‌ 27వ ర్యాంక్‌లో ఉంది. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌ ప్రారంభించినప్పటి నుంచి టీమిండియా అత్యుత్తమంగా 1996లో 94వ స్థానం దక్కించుకుంది.  

ర్యాన్‌ విలియమ్స్‌కు అనుమతి 
ఆ్రస్టేలియా ఆటగాడు ర్యాన్‌ విలియమ్స్‌ భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు ‘ఫిఫా’ అంగీకారం తెలిపింది. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో బెంగళూరు ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ)కు ప్రాతినిధ్యం వహిస్తున్న ర్యాన్‌ విలియమ్స్‌ ఇటీవల ఆసీస్‌ పౌరసత్వాన్ని వదులుకున్నాడు. దీంతో అతడు భారత జట్టు సెలెక్షన్‌కు అందుబాటులోకి వచ్చాడు. 

ఈ మేరకు అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) వివరాలు వెల్లడించింది. 32 ఏళ్ల ర్యాన్‌ ఆ్రస్టేలియా పాస్‌పోర్ట్‌ అప్పగించి భారత పౌరసత్వం పొందాడు. విలియమ్స్‌ తల్లి ముంబైలో జన్మించడంతో అతడికి ముందు నుంచే భారత్‌పై ప్రత్యేక అభిమానం ఉంది. మరిప్పుడు జాతీయ జట్టు తరఫున అతడికి అవకాశం దక్కుతుందా చూడాలి. 

‘ర్యాన్‌ విలియమ్స్‌కు సంబంధించిన అసోసియేషన్‌ మార్పు అభ్యర్థనను ఫిఫా ఆమోదించింది. దీంతో ర్యాన్‌ భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడానికి అధికారికంగా అర్హత పొందాడు’ అని ఏఐఎఫ్‌ఎఫ్‌ వెల్లడించింది. ఆ్రస్టేలియా అండర్‌–20, అండర్‌–23 జట్లకు ప్రాతినిధ్యం వహించిన ర్యాన్‌... సీనియర్‌ టీమ్‌ తరఫున దక్షిణ కొరియాతో మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగాడు. ఇంగ్లిష్‌ క్లబ్‌లు ఫుల్హామ్, పోర్ట్స్‌మౌత్‌ తరఫున కూడా ర్యాన్‌ మ్యాచ్‌లు ఆడాడు.  

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)