Breaking News

సాత్విక్ – చిరాగ్‌ జోడీకి నిరాశ 

Published on Mon, 01/22/2024 - 04:20

న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరిగిన ప్రతిష్టాత్మక టోర్నీలో భారత బ్యాడ్మింటన్‌ డబుల్స్‌ ద్వయం సాత్విక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌శెట్టిలకు చుక్కెదురైంది. బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ – సూపర్‌ 750 టోర్నీ ఇండియా ఓపెన్‌లో భారత జోడి రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో కొరియాకు చెందిన వరల్డ్‌ చాంపియన్‌ జంట కాంగ్‌ మిన్‌ హ్యూక్‌ – సియో సంగ్‌ జె 15–21, 21–11, 21–18 స్కోరుతో సాత్విక్ – చిరాగ్‌పై విజయం సాధించింది.

65 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి గేమ్‌ను సునాయాసంగానే గెలుచుకున్న భారత జోడి ఆ తర్వాత తడబడింది. ముఖాముఖీ పోరులో కొరియా ఆటగాళ్లతో ఈ మ్యాచ్‌కు ముందు 4–1తో సాతి్వక్‌–చిరాగ్‌లదే పైచేయిగా ఉంది. అదే తరహాలో చక్కటి ర్యాలీలతో దూసుకుపోయిన వీరిద్దరు తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నారు. రెండో గేమ్‌లో 1–5తో ఆరంభంలో వెనుకబడిన మన ఆటగాళ్లు ఆ తర్వాత కోలుకోలేకపోయారు.

ఒక దశలో వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించిన కొరియా టీమ్‌ 15–5తో ముందంజలో నిలిచి ఆపై గేమ్‌ను గెలుచుకుంది. మూడో గేమ్‌ పోటాపోటీగా సాగింది. గేమ్‌ తొలి అర్ధభాగాన్ని కొరియా ఆటగాళ్లు 11–6తో ముగించారు. అయితే ఆ తర్వాత భారత ద్వయం కోలుకొని మళ్లీ నిలిచారు. 15–16కు, ఆపై 18–19 వరకు స్కోరు వెళ్లింది. అయితే సాత్విక్ బయటకు కొట్టిన షాట్‌తో, అనంతరం చిరాగ్‌ నెట్‌కు కొట్టిన షాట్‌తో కొరియా విజయం ఖాయమైంది. 

తైజుకు మహిళల టైటిల్‌ 
వరల్డ్‌ నంబర్‌ 3 ప్లేయర్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో నాలుగో సీడ్‌ తై జు 21–16, 21–12తో రెండో సీడ్‌ చెన్‌ యు ఫిపై విజయం సాధించింది.  పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను షి యు కి (చైనా) సొంతం చేసుకున్నాడు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)