Breaking News

బాలాజీ కీలక ఆటగాడు

Published on Fri, 12/26/2025 - 04:06

న్యూఢిల్లీ: అనుభవజ్ఞుడైన శ్రీరామ్‌ బాలాజీ భారత టెన్నిస్‌లో కీలక ఆటగాడని, తదుపరి డేవిస్‌ కప్‌ ‘టై’ కోసం అతని పేరును తప్పకుండా పరిశీలిస్తామని భారత కెప్టెన్ రోహిత్‌ రాజ్‌పాల్‌ తెలిపాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8 తేదీల్లో జరిగే డేవిస్‌ కప్‌ క్వాలిఫయర్స్‌లో నెదర్లాండ్స్‌తో తలపడే భారత జట్టుకు డబుల్స్‌ స్పెషలిస్ట్‌ ప్లేయర్‌ బాలాజీ పక్కన బెట్టారు. దీనిపై రాజ్‌పాల్‌ స్పందిస్తూ మేలైన కాంబినేషన్‌లో భాగంగానే అతన్ని పక్కన బెట్టాల్సి వచ్చిందని అన్నాడు. 

బాలాజీ జట్టు అవసరాల కోసం గతంలో సింగిల్స్‌ కూడా ఆడాడని కెప్టెన్‌ గుర్తు చేశాడు. సీనియర్‌ డబుల్స్‌ ఆటగాడిని తప్పకుండా తదుపరి డేవిస్‌ కప్‌ మ్యాచ్‌ల కోసం పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ‘డబుల్స్‌లో మంచి కాంబినేషన్‌ కోసం అన్వేషించాం. ఇందులో భాగంగా ‘డ్యూస్‌–కోర్ట్‌’ ప్లేయర్‌ అయితే బాగుంటుందనిపించింది. 

యూకీ బాంబ్రీ ‘ఆడ్‌–కోర్ట్‌’ ప్లేయర్‌ అందుకే హైదరాబాదీ ఆటగాడు రిచ్చింక్‌ బొల్లిపల్లిని ‘డ్యూస్‌–కోర్ట్‌’ ప్లేయర్‌గా భావించి యూకీకి జతగా ఎంపిక చేశాం’ అని రాజ్‌పాల్‌ వివరణ ఇచ్చాడు. డ్యూస్‌–కోర్ట్‌ అంటే ఆట మొదలయ్యే కోర్ట్‌ కుడివైపున ఉండేది. ఆడ్‌–కోర్ట్‌ అంటే అడ్వాంటేజ్‌ ఎడమ వైపున ఉంటుంది.  

ఆర్యన్‌ షా అవుట్‌ 
భారత డేవిస్‌ కప్‌ జట్టులో రిజర్వ్‌ ప్లేయర్‌గా ఎంపికైన ఆర్యన్‌ షాను తొలగించినట్లు ఆలిండియా టెన్నిస్‌ సంఘం (ఐటా) స్పష్టం చేసింది. ‘నెదర్లాండ్స్‌తో జరిగే డేవిస్‌ పోరుకు అందుబాటులో ఉంటానని ఆర్యన్‌ చెప్పడంతోనే అతని రిజర్వ్‌ ఆటగాడిగా తీసుకున్నాం. కానీ జట్టును ప్రకటించాక తాను ఆ సమయంలో అందుబాటులో ఉండలేనంటూ ఐటాకు లేఖ రాశాడు. 

ఇది ఏమాత్రం ఆమోద యోగ్యం కానేకాదు’ అని ఐటా ఉన్నతాధికారి ఒకరు ఆర్యన్‌ వ్యవహారశైలిని తప్పుబట్టారు. సింగిల్స్‌లో 403 ర్యాంకర్‌ ఆర్యన్‌ షా భారత నంబర్‌ వన్‌ సుమిత్‌ నగాల్‌ (277 ర్యాంకు) తర్వాత మేటి ర్యాంక్‌ ప్లేయర్‌. అయితే అతని కన్నా తక్కువ ర్యాంకుల్లో ఉన్న కరణ్‌ (471), దక్షిణేశ్వర్‌ సురేశ్‌ (524) ప్రధాన జట్టుకు ఎంపిక చేసిన తనను మాత్రం రిజర్వ్‌గా ఉంచడంతో తప్పుకున్నాడు. 

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)