Breaking News

అమిత్‌కు పిలుపు హుసాముద్దీన్‌పై వేటు 

Published on Sun, 04/14/2024 - 04:23

న్యూఢిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌ వరల్డ్‌ క్వాలిఫయింగ్‌ బాక్సింగ్‌ చివరి టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. గత నెలలో జరిగిన తొలి క్వాలిఫయింగ్‌ టోర్నీలో భారత బాక్సర్లు తొమ్మిది కేటగిరీల్లో బరిలోకి దిగినా ఒక్కరు కూడా ఒలింపిక్స్‌ బెర్త్‌ను దక్కించుకోలేకపోయారు. తొలి టోర్నీలో పాల్గొన్న ఐదుగురు బాక్సర్లపై (దీపక్‌ భోరియా, హుసాముద్దీన్, శివ థాపా, లక్ష్య చహర్, జాస్మిన్‌) వేటు పడింది.

దీపక్‌ స్థానంలో 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌ స్వర్ణ పతక విజేత అమిత్‌ పంఘాల్‌కు మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కింది. తెలంగాణ బాక్సర్‌ హుసాముద్దీన్‌ స్థానంలో సచిన్‌ సివాచ్‌ను ఎంపిక చేశారు. చివరి క్వాలిఫయింగ్‌ టోర్నీ మే 25 నుంచి జూన్‌ 2 వరకు బ్యాంకాక్‌లో జరుగుతుంది. ఇప్పటి వరకు భారత్‌ నుంచి మహిళల విభాగంలో నలుగురు బాక్సర్లు (నిఖత్‌ జరీన్, ప్రీతి, పరీ్వన్, లవ్లీనా) పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.  

భారత బాక్సింగ్‌ జట్టు:
పురుషుల విభాగం: అమిత్‌ పంఘాల్‌ (51 కేజీలు), సచిన్‌ సివాచ్‌ (57 కేజీలు), అభినాష్‌ జమ్వాల్‌ (63.5 కేజీలు), నిశాంత్‌ దేవ్‌ (71 కేజీలు), అభిమన్యు (80 కేజీలు), సంజీత్‌ (92 కేజీలు), నరేందర్‌ (ప్లస్‌ 92 కేజీలు). మహిళల విభాగం: అంకుశిత (60 కేజీలు), అరుంధతి (66 కేజీలు).

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)