Breaking News

ముస్కాన్, నిషా, రాహుల్‌లకు స్వర్ణ పతకాలు

Published on Mon, 08/11/2025 - 04:13

బ్యాంకాక్‌: ఆసియా అండర్‌–19 బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు అదరగొట్టారు. మూడు స్వర్ణాలు, ఏడు రజతాలు, నాలుగు కాంస్య పతకాలతో కలిపి మొత్తం 14 పతకాలను సొంతం చేసుకున్నారు. ఇందులో మహిళా బాక్సర్లవే తొమ్మిది పతకాలు ఉండటం విశేషం. ముస్కాన్‌ (57 కేజీలు), నిషా (54 కేజీలు) పసిడి పతకాలు నెగ్గగా... ఆర్తి కుమారి (75 కేజీలు), కృతిక వాసన్‌ (80 కేజీలు), ప్రాచీ టోకస్‌ (ప్లస్‌ 80 కేజీలు), వినీ (60 కేజీలు), నిషా (65 కేజీలు) రజత పతకాలు గెలిచారు. 

యశిక (51 కేజీలు), ఆకాంక్ష (70 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. ఫైనల్స్‌లో ముస్కాన్‌ 3:2తో అయజాన్‌ ఎర్మెక్‌ (కజకిస్తాన్‌)పై, నిషా 4:1తో సిరుయ్‌ యాంగ్‌ (చైనా)పై నెగ్గారు. పురుషుల 65 కేజీల విభాగంలో రాహుల్‌ కుందు బంగారు పతకాన్ని సాధించాడు. ఫైనల్లో రాహుల్‌ 4:1తో యాకుబోవెక్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై గెలిచాడు. ఫైనల్లో ఓడిన మౌజమ్‌ సుహాగ్‌ (65 కేజీలు), హేమంత్‌ సాంగ్వాన్‌ (90 కేజీలు) రజత పతకాలతో సరిపెట్టుకున్నారు. శివమ్‌ (55 కేజీలు), గౌరవ్‌ (85 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)