Breaking News

నిశాంత్‌ దేవ్‌కు పారిస్‌ ‘టికెట్‌’

Published on Sat, 06/01/2024 - 04:30

బ్యాంకాక్‌: భారత బాక్సర్‌ నిశాంత్‌ దేవ్‌ పారిస్‌ విమానం ఎక్కనున్నాడు. ప్రతిష్టాత్మక విశ్వ క్రీడలకు అతను అర్హత సంపాదించాడు. మెగా ఈవెంట్‌కు ఆఖరి అర్హత టోర్నీ అయిన ‘వరల్డ్‌ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌’లో నిశాంత్‌ పురుషుల 71 కేజీల విభాగంలో సెమీఫైనల్‌ చేరడం ద్వారా బెర్త్‌ దక్కించుకున్నాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో అతను 5–0తో వాసిల్‌ సె»ొటరి (మాల్దొవా)పై ఏకపక్ష విజయం సాధించాడు. 

మహిళల 60 కేజీల క్వార్టర్స్‌లో అంకుశిత 2–3తో అగ్నెస్‌ (స్వీడన్‌) చేతిలో ఓడి... అరుంధతి 1–4తో జెస్సికా (స్లొవేకియా) చేతిలో ఓడి ఒలింపిక్స్‌కు దూరమయ్యారు. పురుషుల 51 కేజీల ప్రిక్వార్టర్స్‌లో భారత స్టార్‌ బాక్సర్‌ అమిత్‌ పంఘాల్‌ 5–0తో కిమ్‌ ఇంక్యూ (కొరియా)పై గెలిచి ‘పారిస్‌’కు అడుగు దూరంలో ఉన్నాడు. 

57 కేజీల క్వార్టర్స్‌లో సచిన్‌ సివాచ్‌ 4–1 తో శామ్యూల్‌ కిస్తోహరీ (ఫ్రాన్స్‌)పై గెలిచి సెమీస్‌ చేరాడు. ఈ వెయిట్‌ కేటగిరీలో మూడు బెర్త్‌లు మాత్రమే ఉండటంతో సచిన్‌ ఫైనల్‌ చేరాలి లేదంటే ‘బాక్స్‌ ఆఫ్‌’ బౌట్‌లో గెలిస్తే పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాడు. పురుషుల 92 కేజీల విభాగం ప్రిక్వార్టర్‌ ఫైనల్లో భారత బాక్సర్‌ సంజీత్‌ 0–5తో అల్ఫోన్సో (అజర్‌బైజాన్‌) చేతిలో ఓడిపోయాడు.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)