టెస్టులు ఆడే సత్తా ఉంది: తిలక్‌ వర్మ

Published on Wed, 12/03/2025 - 03:27

న్యూఢిల్లీ: సంప్రదాయ టెస్టు క్రికెట్‌ సైతం ఆడే సత్తా తనలో ఉందని భారత బ్యాటర్‌ ఠాకూర్‌ తిలక్‌ వర్మ అన్నాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు రాబట్టేందుకు విరాట్‌ కోహ్లి సలహా తీసుకున్నానని ఈ స్టార్‌ హైదరాబాదీ క్రికెటర్‌ చెప్పాడు. భారత్‌ తరఫున అంతర్జాతీయ వన్డేలు ఆడిన 23 ఏళ్ల బ్యాటర్‌కు ఇంకా టెస్టులు ఆడే అవకాశమైతే రాలేదు. అయితే భారత టి20 జట్టులో మాత్రం పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఆసియా టి20 క్రికెట్‌ టోర్నీలో భారత్‌ను విజేతగా నిలిపేందుకు అజేయ పోరాటం చేశాడు.

 డిజిటల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తిలక్‌ మాట్లాడుతూ ‘వన్డేలు, టెస్టులు కూడా నాకు నప్పుతాయి. సంప్రదాయ ఫార్మాట్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాను. మరిన్ని వన్డేలు ఆడేందుకు నేనెంతగానో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఒకే జట్టులో రోహిత్, విరాట్‌ ఉంటే ఆ జట్టులో ఆత్మవిశ్వాసం మరోస్థాయిలో ఉంటుంది. వాళ్లిద్దరికి ఎంతో అనుభవముంది. వారి పరుగుల పరిజ్ఞానం అద్భుతం. నేనైతే వీలైనప్పుడల్లా వారి సలహాలు తీసుకుంటూనే ఉంటాను. 

ముఖ్యంగా ఫిట్‌నెస్‌లో కోహ్లి సూపర్‌. అందుకే వికెట్ల మధ్య చురుగ్గా పరుగులు తీసేందుకు అతని చిట్కాలే పాటిస్తా’ అని అన్నాడు. హైదరాబాద్‌ స్టార్‌ బ్యాటర్‌ టీమిండియా తరఫున కేవలం నాలుగే వన్డేలు ఆడాడు. ఫిఫ్టీ (52) సహా 68 పరుగులు చేశాడు. రెండేళ్ల క్రితం 2023లో దక్షిణాఫ్రికా పర్యటనలో చివరిసారిగా వన్డే ఆడిన అతనికి మళ్లీ 50 ఓవర్ల ఫార్మాట్‌లో బరిలోకి దిగే అవకాశం లభించలేదు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌లలో వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకుంటానని చెప్పాడు.  

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)