Breaking News

జాతీయ రికార్డు బద్దలు కొట్టిన యువ అథ్లెట్‌

Published on Sun, 02/16/2025 - 16:01

న్యూఢిల్లీ: భారత యువ అథ్లెట్‌ గుల్వీర్‌ సింగ్‌ (Gulveer Singh) బోస్టన్‌లో జరిగిన ఇన్విటేషనల్‌ టోర్నీలో జాతీయ రికార్డు నెలకొల్పాడు. 3000 మీటర్ల ఇండోర్‌ రేసులో గుల్వీర్‌ సింగ్‌ 7 నిమిషాల 38.26 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. తద్వారా 16 ఏళ్ల క్రితం సురేందర్‌ సింగ్‌ (7:49.47) నెలకొల్పిన రికార్డును గుల్వీర్‌ బద్దలు కొట్టాడు. 2022 హాంగ్జూ ఆసియా క్రీడల 10,000 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాధించిన గుల్వీర్‌... సీజన్‌ ఆరంభంలోనే రికార్డు నెలకొల్పడం ఆనందంగా ఉందన్నారు.

‘సీజన్‌ తొలి ఇండోర్‌ టోర్నీలోనే మంచి ప్రదర్శన కనబర్చడం సంతోషంగా ఉంది. దీంతో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. ఈ స్ఫూర్తితో ఔట్‌ డోర్‌ ఈవెంట్‌లలోనూ సత్తా చాటుతా’ అని 26 ఏళ్ల గుల్వీర్‌ పేర్కొన్నాడు.

ఇదే టోర్నీలో పాల్గొన్న భారత మరో రన్నర్‌ రాహుల్‌ 8 నిమిషాల 8.27 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. ప్రస్తుతం గుల్వీర్‌ పేరిటే 5000 మీటర్లు, 10,000 మీటర్ల జాతీయ రికార్డులు ఉన్నాయి. 5000 మీటర్ల పరుగును 13 నిమిషాల 11.82 సెకన్లలో పూర్తి చేసిన గుల్వీర్‌... 10,000 మీటర్ల రేసును 27 నిమిషాల 14.88 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ జరగనున్న నేపథ్యంలో భారత మిడిల్, లాంగ్‌ డిస్టాన్స్‌ రన్నర్‌లు ప్రస్తుతం అమెరికాలో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)