Breaking News

Paris Olympics 2024: లక్ష్యానికి చేరని భారత బాణం

Published on Sun, 08/04/2024 - 08:19

పారిస్‌: ఒలింపిక్స్‌లో మన ఆర్చర్లకు మరోసారి నిరాశ తప్పలేదు! భారీ అంచనాలు, మంచి ఫామ్‌తో పారిస్‌లో అడుగుపెట్టిన ఆర్చర్లు పోటీపడ్డ అన్నీ విభాగాల్లో విఫలమై.. రిక్తహస్తాలతో ఇంటిబాట పట్టారు. ఇప్పటికే పురుషుల టీమ్, మహిళల టీమ్, మిక్స్‌డ్‌ టీమ్, పురుషుల వ్యక్తిగత విభాగాల్లో మనవాళ్లకు చేదు ఫలితాలు ఎదురుకాగా... శనివారం మహిళల వ్యక్తిగత విభాగంలోనూ అదే పునరావృతం అయింది. 

ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత స్టార్‌ దీపికా కుమారి క్వార్టర్‌ ఫైనల్లో కొరియాకు చెందిన 19 ఏళ్ల టీనేజ్‌ ఆర్చర్‌ నామ్‌ సిహైన్‌ చేతిలో ఓడగా.. తొలిసారి విశ్వ క్రీడల్లో ఆడుతున్న భజన్‌ కౌర్‌ ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. ‘పారిస్‌’ క్రీడల రికర్వ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఆర్చర్‌ బొమ్మదేవర ధీరజ్‌–అంకిత భకత్‌ నాలుగో స్థానంలో నిలవడమే ఒలింపిక్స్‌ చరిత్రలో మన ఆర్చర్ల అత్యుత్తమ ప్రదర్శన.  

వరుసగా నాలుగోసారి ఒలింపిక్స్‌ బరిలోకి దిగిన దీపిక శనివారం జరిగిన రికర్వ్‌ మహిళల వ్యక్తిగత క్వార్టర్‌ ఫైనల్లో 4–6 (28–26, 25–28, 29–28, 27–29, 27–29)తో నామ్‌ సిహైన్‌ చేతిలో పరాజయం పాలైంది. తొలి మూడు సెట్‌లలో రెండింట గెలిచి 4–2తో ఆధిక్యంలోకి వెళ్లి ఆశలు రేపిన దీపిక.. నాలుగో సెట్‌లో గురితప్పి 7 పాయింట్లు సాధించడంతో వెనుకబడింది. 

14 ఏళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా పతకాలు సాధిస్తూ మేటి ఆర్చర్‌గా పేరు తెచ్చుకున్న దీపిక వరుసగా నాలుగో ఒలింపిక్స్‌లోనూ పతకం లేకుండానే వెనుదిరిగింది. ‘నిరాశ చెందా. ఒలింపిక్స్‌లో ప్రతిసారీ ఇలాంటి ఫలితాలే ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు.

ఈ వాతావరణం, అంచనాలే కారణమనుకుంటా. రెండు బాణాలు గురి తప్పడంతో.. మ్యాచ్‌ను నేనే ప్రత్యరి్థకి అప్పగించినట్లు అనిపించింది’ అని 2012 ‘లండన్‌’లో 33వ స్థానంలో, 2016 ‘రియో’లో 16వ స్థానంలో, 2020 టోక్యోలో 8వ స్థానంలో నిలిచిన దీపిక వ్యాఖ్యానించింది. 

క్వార్టర్‌ ఫైనల్లో దీపిక గెలిచి ఉంటే సెమీఫైనల్‌కు అర్హత సాధించి కనీసం కాంస్య పతక రేసులో నిలిచేది. అంతకుముందు ప్రిక్వార్టర్స్‌లో దీపిక 6–4 (27–24, 27–27, 26–25, 27–29, 27–27)తో మిచెల్లి క్రాపెన్‌ (జర్మనీ)పై గెలిచింది. 

మరో ఆర్చర్‌ భజన్‌ కౌర్‌ ‘షూట్‌ ఆఫ్‌’లో దినంద చోరునిసా (ఇండోనేసియా) చేతిలో ఓడింది. మొదట స్కోర్లు 28–29, 27–25, 26–28, 28–28, 27–26తో సమం కాగా.. విజేతను నిర్ణయించేందుకు నిర్వహించిన ‘షూట్‌ ఆఫ్‌’లో తడబడ్డ భజన్‌ 8 పాయింట్లు సాధించగా.. 9 పాయింట్లతో ఇండోనేసియా ఆర్చర్‌ ముందంజ వేసింది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)