Breaking News

ఈ ఒక్కటి గెలిస‍్తే చాలు!

Published on Sat, 07/19/2025 - 04:14

లండన్‌: భారత మహిళల జట్టు ఇంగ్లండ్‌ గడ్డపై అరుదైన ఘనతను సొంతం చేసుకునేందుకు ఒక్క విజయం దూరంలో ఉంది. నేడు ‘క్రికెట్‌ మక్కా’ లార్డ్స్‌ మైదానంలో జరిగే రెండో వన్డేలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం గెలిస్తే వరుస సిరీస్‌లతో పండగ చేసుకోవడం ఖాయం. టాపార్డర్‌ సూపర్‌ ఫామ్, బౌలింగ్‌లో నిలకడ కనబరుస్తున్న టీమిండియాకు విజయం, సిరీస్‌ కైవసం ఏమంత కష్టం కానేకాదు. 

ఇంగ్లండ్‌ మాత్రం వన్డే సిరీస్‌ రేసులో నిలబడాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఒత్తిడిని నెత్తిన పెట్టుకొని బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్‌ వైఫల్యం ఆతిథ్య జట్టుకు ప్రతికూల ఫలితాలిస్తున్నాయి. గత ఓటమి నుంచి బయటపడి, కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. 

జోరుమీదున్న భారత్‌ 
బ్యాటర్లు, బౌలర్లు అందరు ఫామ్‌లో ఉండటం భారత జట్టులో సమరోత్సాహాన్ని అమాంతం పెంచుతోంది. వన్డే జట్టులోకి రాగానే ప్రతీక రావల్‌ సత్తా చాటుకుంది. స్మృతి, హర్లీన్‌ డియోల్‌లు కూడా మెరుగ్గానే ఆడారు. కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్, రిచా ఘోష్‌... ఈ ఇద్దరు మాత్రమే రెండు పదుల స్కోరైనా చేయలేకపోయారు. కానీ మిడిలార్డర్లో జెమీమా, దీప్తి శర్మ మ్యాచ్‌లను గెలిపించే ఇన్నింగ్స్‌ ఆడటంతో బ్యాటింగ్‌ మరింత పటిష్టమైంది. బౌలింగ్‌లో క్రాంతి, స్నేహ్‌ రాణా, శ్రీచరణి, అమన్‌జోత్‌లు సమష్టిగా ఇంగ్లండ్‌ బ్యాటర్ల భరతం పట్టారు. లార్డ్స్‌ లోనూ మరో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిస్తే ఎంచక్కా ఇక్కడే సిరీస్‌ను చేజిక్కించుకోవచ్చు.  

ఓడితే ఇక నెగ్గలేరు 
మరోవైపు భారత్‌తో పోలిస్తే... ఆతిథ్య ఇంగ్లండ్‌ది భిన్నమైన పరిస్థితి. సొంతగడ్డపై ఇదివరకే టి20 సిరీస్‌ను కోల్పోయింది. ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా కోల్పోయే స్థితిలో ఉంది. ‘లార్డ్స్‌’ పోరులో ఓడితే ఇక సిరీస్‌ నెగ్గే అవకాశమే ఉండదు. ప్రధాన ప్లేయర్లంతా కీలకమైన తరుణంలో చేతులెత్తేయడం... పరుగులో వెనుకబడటం, వికెట్లు తీయడంలో అలసత్వం... ఇవన్నీ ఆతిథ్య జట్టుకు కొండంత కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. 

ఇలాంటి ఒత్తిడి ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌లో నిలవడం కాస్త కష్టమైన పనే! గత మ్యాచ్‌లో ఓపెనర్లు టామీ బ్యూమోంట్, అమీ జోన్స్‌ల ఘోరమైన వైఫల్యం జట్టుకు ప్రతికూలమైంది. మిడిలార్డర్‌లో సోఫియా డంక్లీ, అలైస్‌ రిచర్డ్స్‌ల అర్ధసెంచరీలతో జట్టు పోరాడే స్కోరు చేయగలిగింది. 

అయితే బౌలర్లు నిరుత్సాహపరిచే ప్రదర్శనతో లక్ష్యాన్ని భారత్‌ సులువుగా ఛేదించింది. కేట్‌ క్రాస్, లారెన్‌ బెల్, సోఫీ ఎకిల్‌స్టోన్‌లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. అయితే సిరీస్‌లో నిలవాల్సిన ఈ మ్యాచ్‌లో అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు బాధ్యత కనబరిస్తేనే ఆశించిన ఫలితాన్ని రాబట్టొచ్చు. 

తుదిజట్లు (అంచనా) 
భారత్‌: హర్మన్‌ప్రీత్‌ (కెప్టెన్), ప్రతీక, స్మృతి మంధాన, హర్లీన్, జెమీమా, దీప్తిశర్మ, రిచా ఘోష్, అమన్‌జ్యోత్, స్నేహ్‌ రాణా, శ్రీచరణి, క్రాంతి గౌడ్‌.
ఇంగ్లండ్‌: నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (కెప్టెన్), బ్యూమోంట్, అమీ జోన్స్, ఎమ్మా లాంబ్, సోఫియా డంక్లీ, అలైస్‌ రిచర్డ్స్, సోఫీ ఎకిల్‌స్టోన్, చార్లీ డీన్, కేట్‌ క్రాస్, లారెన్‌ ఫైలెర్, లారెన్‌ బెల్‌. 

ఇంగ్లండ్‌ జట్టు, ప్రతీకలపై జరిమానా 
భారత టాపార్డర్‌ బ్యాటర్‌ ప్రతీక రావల్‌ మ్యాచ్‌ ఫీజులో కోత విధించారు. సౌతాంప్టన్‌లో తొలి వన్డే సందర్భంగా 18వ ఓవర్‌ వేసిన లారెన్‌ ఫైలెర్, ఆ మరుసటి ఓవర్‌ వేసిన సోఫీ ఎకిల్‌స్టోన్‌తో ప్రతీక అనుచితంగా ప్రవర్తించింది. ఇది ప్లేయర్ల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించడమే అని తేల్చిన రిఫరీ ఆమె మ్యాచ్‌ ఫీజులో 10 శాతం జరిమానాతో పాటు ఒక డీమెరిట్‌ పాయింట్‌ విధించారు. 

మరోవైపు మందకొడి బౌలింగ్‌ నమోదు చేసినందుకు ఇంగ్లండ్‌ జట్టు మొత్తానికి జరిమానా పడింది. నిర్ణీత సమయంలో కోటా ఓవర్లను పూర్తి చేయలేకపోవడంతో ప్లేయర్ల మ్యాచ్‌ ఫీజులో 5 శాతం కోత పెట్టినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

4 లార్డ్స్‌ మైదానంలో భారత్, ఇంగ్లండ్‌ మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు నాలుగు వన్డేలు జరిగాయి. రెండింటిలో భారత్, మరో రెండింటిలో ఇంగ్లండ్‌ గెలిచాయి. ఈ మైదానంలో ఇంగ్లండ్‌పై భారత్‌ అత్యధిక స్కోరు 230 కాగా, అత్యల్ప స్కోరు 169.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)