Breaking News

ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓట‌మి..

Published on Sun, 06/15/2025 - 14:14

ఎఫ్‌ఐహెచ్‌ మహిళల ప్రొ లీగ్‌లో భారత అమ్మాయిలు ఆఖరిదాకా పోరాడినా ఆస్ట్రేలియా చేతిలో పరాజయం తప్పలేదు. లండన్‌ వేదికగా శనివారం జరిగిన పోరులో మహిళల జట్టు 2–3 స్కోరుతో కంగారు చేతిలో కంగుతింది. ఆరంభంలో భారత అమ్మాయిలకు కలిసిరాలేదు. తొలిక్వార్టర్లో రెండు పెనాల్టీ కార్నర్లు లభించగా... భారత స్ట్రయికర్లు లక్ష్యం చేర్చేందుకు శతవిధాలా ప్రయతి్నంచారు.

కానీ ప్రత్యర్థి డిఫెండర్లు, గోల్‌కీపర్‌ అలీషా సమన్వయంతో అడ్డుకున్నారు. అయితే రెండో క్వార్టర్‌ మొదలైన నిమిషంలోనే కౌట్నే షానెల్‌ (16వ నిమిషం) భారత రక్షణ పంక్తిని బోల్తాకొట్టించి ఆసీస్‌కు గోల్‌ తెచి్చపెట్టింది. ఇదే క్వార్టర్లో మరో పదినిమిషాలు గడిచేసరికి నెట్‌వద్ద చురుగ్గా మాటువేసిన లెక్సీ పికెరింగ్‌ (26వ నిమిషం) చాకచక్యంగా గోల్‌ చేసి ఆసీస్‌ ఆధిక్యాన్ని 2–0తో రెట్టింపు చేశారు.

తిరిగి మూడో క్వార్టర్‌ మొదలైన కాసేపటికే టాటమ్‌ స్టివార్ట్‌ (35వ నిమిషం) పెనాల్టీ స్ట్రోక్‌తో కంగారూ సేన 3–0తో ఎదురులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఎట్టకేలకు మూడో క్వార్టర్‌ ముగిసే దశలో డ్రాగ్‌ఫ్లికర్‌ దీపిక (44వ నిమిషం) చేసిన గోల్‌తో భారత్‌ ఖాతా తెరువగలిగింది. 

1–3తో తొలిసారి ఆధిక్యానికి గండికొట్టిన భారత్‌ మళ్లీ 6 నిమిషాల వ్యవధిలో దీపిక ఫ్లిక్‌ చేసిన బంతి రి»ౌండ్‌ కాగా... పక్కనే ఉన్న నేహా (52వ నిమిషం)సమయస్ఫూర్తితో ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లోకి తరలించింది. ఆఖర్లో స్కోరును సమం చేసే అవకాశం పెనాల్టీ కార్నర్‌ రూపంలో వచి్చనప్పటికీ గోల్‌గా మలచడంతో భారత స్ట్రయికర్లు విఫలమాయ్యరు. ఆదివారం ఇదే వేదికపై ఆ్రస్టేలియాతో భారత అమ్మాయిలు రెండో మ్యాచ్‌ ఆడతారు.   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)