ఫైనల్‌ బెర్త్‌ లక్ష్యంగా...

Published on Fri, 08/11/2023 - 03:04

చెన్నై: ఫైనల్‌ బెర్తే లక్ష్యంగా భారత హాకీ జట్టు సన్నద్ధమైంది. ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో శుక్రవారం జరిగే సెమీఫైనల్లో హర్మన్‌ప్రీత్‌ బృందం జపాన్‌ జట్టుతో తలపడుతుంది. ఈ టోరీ్నలో ఇప్పటివరకు ఓటమెరుగని భారత జట్టే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో అందరిపై అధిపత్యం కనబరిచింది... గెలిచింది. కానీ ఇలాంటి అజేయమైన భారత్‌ను నిలువరించింది మాత్రం జపానే! లీగ్‌ దశలో ఇరుజట్ల పోరు 1–1తో డ్రాగా ముగిసింది.

ఇప్పుడు నాకౌట్‌ దశలో జరిగే ఈ పోరులో ఎవరు గెలిస్తే వాళ్లే టైటిల్‌ ఫేవరెట్‌ కావడం ఖాయం. గతంలో జపాన్‌ చేతిలో భారత్‌కు చేదు అనుభవం ఉంది. 2021లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో లీగ్‌ దశలో టీమిండియా 6–0తో జపాన్‌ను చిత్తు చేసినప్పటికీ తీరా సెమీస్‌కు వచ్చేసరికి వారి చేతిలో 3–5తో ఓడి ఇంటికొచ్చింది.

ఇప్పుడు సమష్టి ఆటతీరుతో బదులు తీర్చుకుంటుందా లేదంటే స్వదేశంలోనూ గత అనుభవాన్నే చవిచూస్తుందా అనేది ఇంకొన్ని గంటల్లో తేలుతుంది. చివరి లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 4–0తో చిత్తు చేసి జోరుమీదున్న భారత్‌ పట్టుదలగా ఆడితే విజయం ఏమంత కష్టం కానేకాదు. మరో సెమీఫైనల్లో మలేసియాతో దక్షిణ కొరియా తలపడుతుంది. 5–6 స్థానాల కోసం పాకిస్తాన్, చైనా జట్లు తలపడతాయి.  

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)