Breaking News

'భారత్‌దే ఛాంపియ‌న్స్ ట్రోఫీ.. ఒకే ఒక్క ప‌రుగు తేడాతో'.. క్లార్క్‌ జోస్యం

Published on Sat, 03/01/2025 - 12:45

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో టీమిండియా అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకున్న భార‌త జ‌ట్టు.. త‌మ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మైంది. ఆదివారం దుబాయ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నుంది.

అనంత‌రం రోహిత్ సేన సెమీఫైన‌ల్లో ద‌క్షిణాఫ్రికా లేదా ఆస్ట్రేలియాతో త‌ల‌ప‌డే అవ‌కాశ‌ముంది. ఈ క్ర‌మంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేత‌గా టీమిండియా నిలుస్తుంద‌ని క్లార్క్ జోస్యం చెప్పాడు.

"ఈ మెగా టోర్నీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, భార‌త జ‌ట్లు త‌ల‌ప‌డ‌తాయ‌ని భావిస్తున్నాను. ఆసీస్ ఛాంపియ‌న్స్‌గా నిల‌వాల‌ని నేను మ‌న‌స్పూర్తిగా కోరుకుంటున్నాను. కానీ టీమిండియాకే విజ‌య అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీని భార‌త్ సొంతం చేసుకుంటుంది నేను అనుకుంటున్నాను. 

భార‌త్ ప్ర‌స్తుతం ప్ర‌పంచంలోనే నంబర్ 1 వన్డే జట్టుగా ఉంది. వారిని ఓడించ‌డం అంత ఈజీ కాదు. భార‌త్‌, ఆసీస్ మ‌ధ్య తుది పోరు హోర‌హోరీగా జ‌రుగుతుంది. కానీ టీమిండియా ఒక్క ప‌రుగు తేడాతో విజ‌యం సాధిస్తుంది" అని రేవ్ స్పోర్ట్స్ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క్లార్క్ పేర్కొన్నాడు. అదే విధంగా ఈ మెగా టోర్నీ టాప్ స్కోర‌ర్‌గా టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ నిలుస్తాడ‌ని క్లార్క్ అంచ‌నా వేశాడు.

"రోహిత్ శ‌ర్మ తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు అత‌డు క‌ట‌క్‌లో భారీ సెంచ‌రీ సాధించాడు. అద్భుత‌మైన షాట్ల‌తో అంద‌రిని అల‌రించాడు. అత‌డు ఈ మెగా ఈవెంట్‌లో కూడా మంచి ట‌చ్‌లో క‌న్పిస్తున్నాడు. రోహిత్ భార‌త్‌కు కీల‌కంగా మార‌నున్నాడు.

 అత‌డు త‌న దూకుడును కొన‌సాగించాలి.  ప‌వ‌ర్ ప్లేలో ప‌రుగులు రాబ‌ట్టాల‌న్న అత‌డి ఉద్దేశ్యంలో ఎలాంటి త‌ప్పు లేదు. రోహిత్ అద్భుత‌మైన ఆట‌గాడు. రోహిత్ శ‌ర్మ టోర్నీ టాప్ స్కోర‌ర్‌గా నిలిచిన ఆశ్చర్యపోనవసరం లేదు" అని క్లార్క్ చెప్పుకొచ్చాడు. కాగా బంగ్లాదేశ్‌పై 40 ప‌రుగులు చేసిన హిట్‌మ్యాన్‌.. పాకిస్తాన్ 20 ప‌రుగుల‌తో క్విక్ ఇన్నింగ్స్ ఆడాడు.
చదవండి: జోస్ బట్లర్ రాజీనామా.. ఇంగ్లండ్ కొత్త కెప్టెన్ అతడే!?

 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)