Breaking News

ఇంగ్లండ్‌తో ఐదో టీ20.. భారత జట్టులో కీలక మార్పులు! వారికి ఛాన్స్‌?

Published on Sun, 02/02/2025 - 11:29

భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ చివ‌రి అంకానికి చేరుకుంది. ఈ సిరీస్‌లో ఆఖ‌రి టీ20 ఇరు జ‌ట్ల మ‌ధ్య ఆదివారం ముంబైలోని వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను 4-1తో ముగించాల‌ని భార‌త జ‌ట్టు భావిస్తుంటే.. ఇంగ్లండ్ మాత్రం విజ‌యం సాధించి ప‌రువు నిల‌బెట్టుకోవాల‌ని భావిస్తోంది. కాగా ఇప్ప‌టికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భార‌త్ ఇప్ప‌టికే 3-1 తేడాతో సొంతం చేసుకుంది.

ఈ క్ర‌మంలో నామ‌మాత్ర‌పు మ్యాచ్ అయితే ఐదో టీ20లో భార‌త్ ప‌లు మార్పుల‌తో బ‌రిలోకి దిగ‌నున్న‌ట్లు తెలుస్తోంది. నాలుగో టీ20కు దూర‌మైన స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ తిరిగి జ‌ట్టులోకి రానున్న‌ట్లు తెలుస్తోంది. ఇంగ్లీష్ జ‌ట్టుతో వ‌న్డే సిరీస్‌కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ కోసం అత‌డిని ఆడించాల‌ని జ‌ట్టు మెనెజ్‌మెంట్ భావిస్తోంది. ఈ విష‌యాన్ని భార‌త బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్క‌ల్ ధ్రువీకరించాడు.

కాగా ష‌మీ తుది జ‌ట్టులోకి వ‌స్తే అర్ష్‌దీప్ సింగ్ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. మ‌రోవైపు ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా, అక్ష‌ర్ పటేల్‌కు విశ్రాంతి ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. వారిద్దరి స్ధానంలో ర‌మ‌ణ్‌దీప్ సింగ్‌, హ‌ర్షిత్ రాణా తుది జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. కాగా గ‌త కంక‌ష‌న్‌కు గురైన శివమ్ దూబే ప్ర‌స్తుతం కోలుకోనున్న‌ట్లు స‌మాచారం. అత‌డు వాంఖ‌డే టీ20లో కూడా ఆడే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి.

సూర్య‌, సంజూ మెరుస్తారా?
ఇక పేల‌వ ఆట తీరుతో నిరాశ‌ప‌రుస్తున్న కెప్టెన్ సూర్యకుమార్ యాద‌వ్‌, ఓపెన‌ర్ సంజూ శాంస‌న్‌ల‌కు ఈ మ్యాచ్ చాలా కీల‌కం. ఈ సిరీస్‌కు ముందు వ‌రుస సెంచ‌రీలతో స‌త్తాచాటిన శాంస‌న్‌.. స్వ‌దేశంలో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన సంజూ కేవ‌లం 35 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. 

నాలుగు మ్యాచ్‌ల్లో కూడా బౌన్స‌ర్ బంతులకే సంజూ ఔట్ కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రోవైపు సూర్య‌ది కూడా అదే తీరు. సూర్య‌కుమార్ నాలుగు మ్యాచ్‌ల్లో  26 పరుగులే చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో వీరిద్ద‌రూ రాణించాల్సిన అవ‌స‌ర‌ముంది. కాగా బ్యాటింగ్‌కు అనుకూలించే వాంఖ‌డే స్టేడియంలో ప‌రుగుల వ‌ర‌ద పారే అవకాశ‌ముంది. టాస్ గెలిచిన కెప్టెన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది.

ఐదో టీ20కు భారత తుది జట్టు(అంచనా): సంజు శాంసన్ (వికెట్ కీపర్‌), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), రింకు సింగ్, రమణ్‌దీప్ సింగ్‌, శివమ్ దూబే, హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమీ
చదవండి: నా భార్య లైవ్ చూస్తోంది.. నేను ఆ విష‌యం చెప్ప‌లేను: రోహిత్‌ శర్మ
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)