Breaking News

శ్రీలంక పర్యటన.. టీమిండియా కెప్టెన్‌గా ధృవ్‌ జురెల్‌

Published on Sat, 06/06/2026 - 14:38

ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా క్రీడలకు వేర్వేరు భారత జట్లను ఇవాళ (జూన్‌ 6) ప్రకటించారు. ఈ మూడు జట్లకు కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ ఎంపికయ్యాడు. ఇప్పటివరకు భారత టీ20 జట్టు కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్‌ యాదవ్‌కు సెలెక్టర్లు ఉద్వాసన పలికారు. 

అందరూ ఊహించిన విధంగానే చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ తొలిసారి భారత జట్టుకు ఎంపికయ్యాడు. వైభవ్‌కు మూడు జట్లలో చోటు దక్కింది. 

తెలుగు ఆటగాళ్లు నితీశ్‌ కుమార్‌ రెడ్డి, తిలక్‌ వర్మ కూడా మూడు జట్లలో చోటు దక్కించుకున్నారు. తిలక్‌కు జాక్‌పాట్‌ కూడా తగిలింది. ఆసియా క్రీడల్లో అతడు శ్రేయస్‌ డిప్యూటీగా ఎంపికయ్యాడు.

ఇదే సందర్భంగా జూన్‌ 25 నుంచి శ్రీలంకలో పర్యటించాల్సిన భారత్‌-ఏ జట్టును కూడా ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా ధృవ్‌ జురెల్‌ ఎంపికయ్యాడు. అతడికి డిప్యూటీగా దేవదత్‌ పడిక్కల్‌ నియమించబడ్డాడు. ఈ జట్టులో సాయి సుదర్శన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, అన్షుల్‌ కంబోజ్‌ లాంటి ఐపీఎల్‌ స్టార్లు చోటు దక్కించుకున్నారు.

శ్రీలంకలో జరిగే మల్టీ-డే గేమ్‌ల కోసం భారత-ఏ జట్టు: ధృవ్ జురెల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, ఆయుష్ బదోని, దేవదత్ పడిక్కల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సరాన్ష్ జైన్, గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ, యశ్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్‌, ఎన్‌ జగదీశన్‌, అమన్‌ మోఖడే, షేక్‌ రషీద్‌, జీషన్‌ అన్సారీ

ఇండియా-ఏ టూర్‌ ఆఫ్‌ శ్రీలంక షెడ్యూల్‌
జూన్‌ 25- తొలి అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ (గాలే)
జులై 2- రెండో అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌ (గాలే)

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)