Breaking News

క్వాలిఫయర్స్‌కు భారత్‌

Published on Sun, 09/14/2025 - 03:59

బీల్‌ (స్విట్జర్లాండ్‌): మూడు దశాబ్దాల తర్వాత డేవిస్‌ కప్‌లో భారత జట్టు ఓ ఘనమైన విజయంతో ముందంజ వేసింది. డేవిస్‌ కప్‌ టెన్నిస్‌ వరల్డ్‌ గ్రూప్‌–1 టైలో భాగంగా స్విట్జర్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ 3–1తో విజయం సాధించింది. తొలి రోజు కొత్త కుర్రాడు దక్షిణేశ్వర్‌తో పాటు భారత స్టార్‌ సుమిత్‌ నగాల్‌ వరుస విజయాలతో సింగిల్స్‌లో 2–0తో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌కు రెండో రోజు శనివారం డబుల్స్‌లో పరాజయం ఎదురైంది. దీంతో భారత్‌ ఆధిక్యం 2–1కి తగ్గింది. 

ఈ దశలో రివర్స్‌ సింగిల్స్‌ బరిలోకి దిగిన భారత నంబవర్‌వన్‌ టెన్నిస్‌ స్టార్‌ సుమిత్‌ 6–1, 6–3తో హెన్రీ బెర్నెట్‌పై విజయం సాధించాడు. దీంతో ఈ ‘టై’లో భారత్‌ గెలుపొందింది. ఫలితం రావడంతో నామమాత్రమైన రెండో రివర్స్‌ సింగిల్స్‌ మ్యాచ్‌ను నిర్వహించలేదు. మూడేళ్ల క్రితం 2022లో డెన్మార్క్‌పై గెలిచినప్పటికీ ఇది న్యూఢిల్లీ వేదికపై జరిగింది. తాజా విజయంతో డేవిస్‌ కప్‌ క్వాలిఫయర్స్‌కు భారత్‌ అర్హత సాధించింది. తొలిరౌండ్‌ డేవిస్‌ కప్‌ క్వాలిఫయర్స్‌ పోటీలు వచ్చే జనవరిలో జరుగుతాయి. 

అంతకుముందు జరిగిన డబుల్స్‌లో భారత బృందానికి నిరాశ ఎదురైంది. శ్రీరామ్‌ బాలాజీతో జోడీగా బరిలోకి దిగిన తెలంగాణ ఆటగాడు రితి్వక్‌ బొల్లిపల్లి జంటకు ఆతిథ్య  స్విట్జర్లాండ్‌ జోడీ చేతిలో చుక్కెదురైంది. రితి్వక్‌–బాలాజీ ద్వయంకు 7–6 (8/3), 4–6, 5–7తో జాకుబ్‌ పాల్‌–డామినిక్‌ స్ట్రికెర్‌ జంట చేతిలో పరాజయం ఎదురైంది. మొత్తమ్మీద విదేశీ గడ్డపై భారత్‌ చివరిసారిగా 1993లో గెలిచింది. 

Videos

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు