Breaking News

ఆసీస్‌తో మూడో టెస్టు: నితీశ్‌ రెడ్డి అద్భుతం.. కానీ తుది జట్టులో వద్దు!

Published on Wed, 12/11/2024 - 14:11

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా యువ ఆల్‌రౌండ‌ర్‌, ఆంధ్ర స్టార్ క్రికెట‌ర్ నితీశ్ కుమార్ రెడ్డి దుమ్ములేపుతున్న సంగ‌తి తెలిసిందే. తొలిసారి ఆస్ట్రేలియాలో ఆడుతున్న నితీశ్‌.. మిచెల్ స్టార్క్‌, ప్యాట్ కమ్మిన్స్ వంటి వ‌రల్డ్ క్లాస్ బౌల‌ర్ల‌ను అలోవ‌కగా ఎదుర్కొని అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు.

ఇటీవ‌ల జ‌రిగిన పింక్‌బాల్ టెస్టులో విరాట్ కోహ్లి, రోహిత్ శ‌ర్మ వంటి స్టార్ ప్లేయ‌ర్లు విఫ‌ల‌మైనప్ప‌టికి.. నితీశ్ మాత్రం రెండు ఇన్నింగ్స్‌లోనూ టాప్ స్కోర‌ర్‌గా నిలిచి స‌త్తాచాటాడు. మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 41, 38 (నాటౌట్), 42, 42 పరుగులతో రాణించాడు. అయితే బౌలింగ్‌లో మాత్రం ఈ ఆంధ్ర ఆల్‌రౌండ‌ర్ ఇంకా త‌న మార్క్ చూపించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో భార‌త మాజీ క్రికెట‌ర్ సంజ‌య్ మంజ్రేక‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 2 వికెట్లు మాత్రమే తీసాడు. అతడితో పాటు హర్షిత్ రాణా కూడా పెద్దగా రాణించలేకపోతున్నాడు. దీంతో పేస్‌ బౌలింగ్‌​ భారమంతా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లపైనే పడుతోంది.

ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్రిస్బేన్‌లో జరిగే మూడో టెస్టుకు నితీశ్ రెడ్డిని తప్పించాలని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. 

"నితీష్ కుమార్‌కు అద్బుతమైన బ్యాటింగ్ స్కి‍ల్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్టుపై కూడా అతడు ఫియర్‌లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పెద్దగా పరుగులు సాధించకపోయినప్పటకి.. అంతర్జాతీయ క్రికెట్‌లో మెరుగ్గా రాణించడం నిజంగా శుభసూచికం. 

ఆస్ట్రేలియా వంటి పరిస్థితుల్లో నితీశ్‌లా బ్యాటింగ్ చేసే ప్లేయర్లను అరుదుగా చూస్తూ ఉంటాము. కానీ భారత జట్టు మెనెజ్‌మెంట్ ప్లేయింగ్ ఎలెవన్ కాంబినేషన్‌పై ఆలోచన చేయాలి. బౌలింగ్ యూనిట్‌పై కూడా దృష్టిసారించాలి. 

నితీష్ బ్యాట్‌తో రాణిస్తున్నా..బౌలింగ్‌లో మాత్రం తేలిపోతున్నాడు. కాబట్టి నితీశ్ రెడ్డిని కేవలం బ్యాటర్‌గా కొనసాగించడం రిస్క్‌తో కూడిన వ్యవహరమని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు.

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)