Breaking News

బంగ్లాదేశ్‌పై ఘన విజయం.. సెమీస్‌లో భారత హాకీ జట్టు

Published on Tue, 10/03/2023 - 07:37

స్వర్ణ పతకం సాధించి... వచ్చే ఏడాది పారిస్‌ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించడమే లక్ష్యంగా ఆసియా క్రీడల్లో బరిలోకి దిగిన భారత పురుషుల హాకీ జట్టు తొలి అడ్డంకిని అధిగమించింది. లీగ్‌ దశలో ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి అజేయంగా నిలిచిన భారత్‌ పూల్‌ ‘ఎ’లో 15 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌ను సొంతం చేసుకొని సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్‌తో సోమవారం జరిగిన చివరిదైన ఐదో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 12–0 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది.

భారత్‌ తరఫున కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (2వ, 4వ, 32వ ని.లో), మన్‌దీప్‌ సింగ్‌ (18వ, 24వ, 46వ ని.లో) మూడు చొప్పున గోల్స్‌ సాధించి ‘హ్యాట్రిక్‌’లు నమోదు చేశారు. అభిషేక్‌ (41వ, 57వ ని.లో) రెండు గోల్స్‌ సాధించగా... నీలకంఠ శర్మ (47వ ని.లో), గుర్జంత్‌ సింగ్‌ (56వ ని.లో), అమిత్‌ రోహిదాస్‌ (28వ ని.లో), లలిత్‌ ఉపాధ్యాయ్‌ (23వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు.

పూల్‌ ‘ఎ’లోనే జపాన్‌ జట్టు 12 పాయింట్లతో రెండో సెమీఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుంది. తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జపాన్‌ 3–2తో పాకిస్తాన్‌ను ఓడించింది. ఈ ఓటమితో పాకిస్తాన్‌ పూల్‌ ‘ఎ’లో మూడో స్థానానికి పరిమితమై సెమీఫైనల్‌కు చేరుకోలేకపోయింది. పూల్‌ ‘బి’ నుంచి దక్షిణ కొరియా, చైనా జట్లు టాప్‌–2లో నిలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. బుధవారం జరిగే సెమీఫైనల్స్‌లో చైనాతో భారత్‌; దక్షిణ కొరియాతో జపాన్‌ తలపడతాయి.   
భారత్, చైనీస్‌ తైపీ మ్యాచ్‌ ‘డ్రా’
ఆసియా క్రీడల్లో భారత మహిళల కబడ్డీ జట్టుకు తొలి మ్యాచ్‌లోనే ఊహించని ఫలితం ఎదురైంది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా చైనీస్‌ తైపీతో సోమవారం జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌ను భారత్‌ 34–34తో ‘డ్రా’ చేసుకుంది. చివరి సెకన్లలో ఆఖరి రెయిడ్‌తో చైనీస్‌ తైపీ బోనస్‌ పాయింట్‌ సంపాదించి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. భారత్‌ ఒకదశలో 26–20తో ముందంజ వేసి ఆరు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే ఈ ఆధిక్యాన్ని భారత జట్టు వృథా చేసుకొని గెలవాల్సిన చోట ‘డ్రా’తో సరిపెట్టుకుంది.
చదవండి: World cup 2023: 'పాక్‌, దక్షిణాఫ్రికా కాదు.. వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌కు చేరే జట్లు ఇవే'

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)