Breaking News

Paris Olympics: జెర్మనీతో సెమీస్‌.. భారత హాకీ జట్టుకు బిగ్ షాక్‌

Published on Mon, 08/05/2024 - 09:36

ప్యారిస్ ఒలింపిక్స్ సెమీఫైన‌ల్స్‌కు ముందు భార‌త హాకీ జ‌ట్టుకు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గ‌లింది. నిషేదం కార‌ణంగా భారత డిఫెండర్‌ అమిత్‌ రోహిదాస్ మంగ‌ళ‌వారం జెర్మ‌నీతో జ‌ర‌గ‌నున్న‌ సెమీఫైన‌ల్‌కు దూర‌మ‌య్యాడు. ఆదివారం గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్‌లో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడని రోహిదాస్‌పై ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్(FIH )టెక్నికల్ డెలిగేట్ ఒక్క మ్యాచ్ నిషేధం విధించింది. 

ఈ క్ర‌మంలోనే సెమీస్ పోరుకు రోహిదాస్ దూరంగా ఉండ‌నున్నాడు. సెమీఫైన‌ల్లో హాకీ జట్టు 16 మంది సభ్యులకు బదులుగా 15 మందితో ఆడ‌నుంది. అయితే హాకీ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయంపై భారత జట్టు అసహనంగా ఉంది. 

అయితే హాకీ ఇండియా ఇప్ప‌టికే ఎఫ్ఐహెచ్ నిర్ణ‌యంపై స‌వాలు చేసింది.  రోహిదాస్‌పై విదించిన బ్యాన్ పై పూనరాలోచించాలని హాకీ ఇండియా అప్పీల్ చేసింది. అయితే సెమీస్‌కు ముందు ఎఫ్ఐహెచ్ త‌మ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకునే అవ‌కాశాలు త‌క్కువ‌.

అస‌లేం జ‌రిగిందంటే?
మ్యాచ్ 17వ నిమిషంలో భారత డిఫెండర్‌ అమిత్‌ రోహిదాస్‌ స్టిక్‌ బ్రిటన్‌ ఫార్వర్డ్‌ విలియమ్‌ కల్నాన్‌ తలకు తగిలింది. వీడియో రీప్లే చూస్తే అతను ఉద్దేశపూర్వకంగా చేసినట్లు అనిపించకపోయినా... మ్యాచ్‌ రిఫరీ తీవ్ర చర్య తీసుకున్నాడు. రోహిదాస్‌కు ‘రెడ్‌ కార్డ్‌’ చూపించడంతో అతను మైదానాన్ని వీడాల్సి వచ్చింది. దాంతో మిగిలిన మ్యాచ్‌ మొత్తం భారత్‌ 10 మందితోనే ఆడింది.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)