Breaking News

కిడాంబి శ్రీకాంత్‌ గెలిపించగా... 

Published on Sun, 10/01/2023 - 02:00

భారత పురుషుల బ్యాడ్మింటన్‌ జట్టు ఆసియా క్రీడల టీమ్‌ ఈవెంట్‌లో తొలిసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. తద్వారా మొదటి స్వర్ణం గెలిచేందుకు మరో అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన సెమీ ఫైనల్లో భారత్‌ 3–2 తేడాతో దక్షిణ కొరియాను ఓడించింది. అనూహ్యంగా కొరియానుంచి భారత్‌కు తీవ్ర ప్రతిఘటన ఎదురు కావడంతో పోరు హోరాహోరీగా సాగిన చివరి మ్యాచ్‌ వరకు వెళ్లింది.

పురుషుల తొలి సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 18–21, 21–16, 21–19తో జీన్‌ హ్యోక్‌ జీన్‌పై విజయం సాధించగా, పురుషుల డబుల్స్‌లో టాప్‌ జోడి సాతి్వక్‌ సాయిరాజ్‌ – చిరాగ్‌ శెట్టిపై 21–13, 26–24తో కాంగ్‌ మిన్‌ హ్యూక్‌ – స్యూంగ్‌ జే సంచలన విజయం సాధించారు.

రెండో సింగిల్స్‌లో లక్ష్య సేన్‌ 21–7, 2–19తో లీ యూన్‌ గ్యూను చిత్తుగా ఓడించినా... రెండో డబుల్స్‌లో ఎంఆర్‌ అర్జున్‌ – ధ్రువ్‌ కపిల 16–21, 11–21తో కిమ్‌ వోన్‌ హో – సంగ్‌ సియూంగ్‌ చేతిలో పరాజయంపాలైంది. దాంతో భారత్‌ను గెలిపించాల్సిన బాధ్యత కిడాంబి శ్రీకాంత్‌పై పడింది. తొలి గేమ్‌ను అతనూ ఓడిపోవడంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే చివరకు 12–21, 21–16, 21–14తో చో జియోనిప్‌పై శ్రీకాంత్‌ గెలుపొందాడు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)