Breaking News

భారత చెస్‌ జట్ల శుభారంభం 

Published on Thu, 09/17/2026 - 06:07

సమర్‌కండ్‌ (ఉజ్బెకిస్తాన్‌): చెస్‌ ఒలింపియాడ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్స్‌గా బరిలోకి దిగిన భారత పురుషుల, మహిళల జట్లు గెలుపు బోణీ కొట్టాయి. బుధవారం మొదలైన ఈ మెగా టోర్నీ తొలి రౌండ్‌లో భారత మహిళల జట్టు 4–0తో డొమినికన్‌ రిపబ్లిక్‌ జట్టును ఓడించింది.

 బోర్డు–1పై ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి 31 ఎత్తుల్లో ఫ్రాంచెస్కా రమిరెజ్‌పై... బోర్డు–2పై వైశాలి 31 ఎత్తుల్లో మిగెలినా డెలారోసాపై... బోర్డు–3పై వంతిక అగర్వాల్‌ 50 ఎత్తుల్లో మేరీ గొంజాలెజ్‌పై... బోర్డు–4పై సవితాశ్రీ 38 ఎత్తుల్లో కార్లా నునెజ్‌ దియాపై గెలుపొందారు. 

మరోవైపు భారత పురుషుల జట్టు 3–1తో థాయ్‌లాండ్‌ జట్టుపై విజయం సాధించింది. బోర్డు–1పై తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ 54 ఎత్తుల్లో ప్రిన్‌ లావోహవిరాపాప్‌ చేతిలో అనూహ్యంగా ఓడిపోగా... బోర్డు–2పై నిహాల్‌ సరీన్‌ 28 ఎత్తుల్లో థానాడోన్‌ కుల్‌ప్రథనోన్‌పై... బోర్డు–3పై దొమ్మరాజు గుకేశ్‌ 37 ఎత్తుల్లో ఫారిస్‌ రషీద్‌పై... బోర్డు–4పై విదిత్‌ గుజరాతి 30 ఎత్తుల్లో తుఫా ఖుమ్నోరఖెవ్‌పై గెలిచారు.    

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)