Breaking News

యువ‌రాజ్ ఫెయిల్‌..బెంగాల్ ఎంపీ తుపాన్ ఇన్నింగ్స్‌! వీడియో వైరల్‌

Published on Tue, 07/09/2024 - 07:36

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఇండియా ఛాంపియ‌న్స్ వ‌రుస‌గా రెండో ఓట‌మి చ‌విచూసింది. సోమవారం ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా ఆస్ట్రేలియా ఛాంపియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 23 ప‌రుగుల తేడాతో భార‌త్ ఓట‌మి పాలైంది.

200 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 176 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. భార‌త బ్యాట‌ర్ల‌లో యూస‌ఫ్ ప‌ఠాన్ ఒక్కడే ఒంట‌రి పోరాటం చేశాడు. 48 బంతులు ఎదుర్కొన్న‌ యూస‌ఫ్ ప‌ఠాన్ 78 ప‌రుగులు చేశాడు.

కానీ ఆఖ‌రిలో ఔట్ కావ‌డంతో జ‌ట్టును గెలిపించ‌లేక‌పోయాడు. యూస‌ఫ్‌తో పాటు అంబ‌టి రాయ‌డు(26) ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌న్పించాడు. కెప్టెన్ యువరాజ్ సింగ్(19) మ‌రోసారి ఫెయిల్ అయ్యాడు.

ఆసీస్ బౌల‌ర్ల‌లో పీట‌ర్ సిడిల్‌, కౌల్ట‌ర్‌నైల్ త‌లా రెండు వికెట్లు ప‌డగొట్ట‌గా.. లాగ్లిన్‌, క్రిస్టియ‌న్ త‌లా వికెట్ సాధించారు. అంత‌కుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 199 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. 

ఆసీస్‌ బ్యాటర్లలో క్రిస్టియన్‌(69) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. షాన్‌ మార్ష్‌(41) పరుగులతో రాణించాడు. భారత బౌలర్లలో కులకర్ణి రెండు, ఆర్పీ సింగ్‌, అనురీత్‌, హార్భజన్‌ సింగ్‌ తలా వికెట్‌ సాధించారు. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో జూలై 10న దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)