Breaking News

తొలి రౌండ్‌ దాటలేకపోయారు

Published on Wed, 08/21/2024 - 05:03

యోకోహామా: భవిష్యత్‌ ఆశాకిరణాలుగా భావిస్తున్న ముగ్గురు భారత యువ క్రీడాకారిణులకు జపాన్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నీ నిరాశను మిగిల్చింది. మంగళవారం మొదలైన ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌ విభాగంలో బరిలోకి దిగిన ముగ్గురు భారత షట్లర్లు మాళవిక బన్సోద్, ఆకర్షి కశ్యప్, అషి్మత చాలిహా తొలి రౌండ్‌ను దాటలేకపోయారు.

అషి్మత 16–21, 12–21తో టాప్‌ సీడ్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో... మాళవిక 21–23, 19–21తో పొలీనా బురోవా (ఉక్రెయిన్‌) చేతిలో... ఆకర్షి 13–21, 12–21తో కిమ్‌ గా యున్‌ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి చవిచూశారు. 

మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్‌లో సతీశ్‌ కుమార్‌ కరుణాకరన్‌–ఆద్యా వరియత్‌ (భారత్‌) జోడీ 10–21, 18–21తో రెహాన్‌–లీసా కుసుమవతి (ఇండోనేసియా) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. పారిస్‌ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ భారత స్టార్స్‌ పీవీ సింధు, లక్ష్య సేన్, హెచ్‌ఎస్‌ ప్రణయ్, సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి, అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో ఈ టోర్నీకి దూరంగా ఉన్నారు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)