Breaking News

IPL 2025: టీమిండియా స్టార్లకు భారీ షాక్‌.. పట్టించుకోని ఫ్రాంచైజీలు

Published on Mon, 11/25/2024 - 17:18

ఐపీఎల్‌-2025 మెగా వేలంలో టీమిండియా స్టార్ ప్లేయర్లు అజిం‍క్య రహానే, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్‌, శ్రీకర్ భరత్‌లకు భారీ షాక్ తగిలింది. రెండో రోజు వేలంలోకి వచ్చిన ఈ ఆటగాళ్లను కొనుగొలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.

ముఖ్యంగా ఐపీఎల్‌లో స్పెషలిస్ట్‌ ఓపెనర్‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ షాను కూడా ఫ్రాంచైజీలు ప‌ట్టించుకోకపోవ‌డం గ‌మ‌నార్హం. అయితే షా ప్ర‌స్తుతం పేలవ ఫామ్‌, ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు.

ఈ కారణంగానే అతడిని ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌న్న‌ది తేట తెల్ల‌మవుతోంది. మరోవైపు గత కొన్ని సీజన్లలో సీఎస్‌కే తరపున అకట్టుకున్న రహానేకు కూడా మొండి చేయి ఎదురైంది.  కోటిన్న‌ర బేస్ ధ‌ర‌తో వేలంలోకి అడుగుపెట్టిన రహానే ఎవరూ కొనుగోలు చేయలేదు. వేలంలో అమ్ముడుపోని మరో ఓపెనర్‌ మయాంక్ అగర్వాల్‌ కనీస ధర కోటిగా ఉంది.

శార్ధూల్‌ది అదే కథ..
వీరితో పాటు స్టార్ ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్‌కు కూడా నిరాశే ఎదురైంది. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శార్ధూల్‌ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ముందకు రాలేదు. గాయం కారణంగా గత కొన్ని నెలలకు దూరంగా ఉన్న శార్ధూల్.. ఇటీవలే తిరిగి మైదానంలో అడగుపెట్టాడు. ప్రస్తుతం సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక పైన పేర్కొన్న ఆటగాళ్లు సెకెండ్‌ రౌండ్‌లోనైనా అమ్ముడుపోతారో లేదో వేచి చూడాలి.
చదవండి: అతడి టెస్టు కెరీర్‌ గొప్పగా సాగుతోంది.. మాకు ఇంతకంటే ఏం కావాలి: బుమ్రా
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)