జోరు సాగనీ...

Published on Sat, 07/12/2025 - 04:46

బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌పై తొలి టి20 సిరీస్‌ గెలిచిన భారత మహిళల క్రికెట్‌ జట్టు... నామమాత్రమైన చివరి మ్యాచ్‌లోనూ అదే జోరు కనబర్చాలని ఆశిస్తోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇప్పటికే 3–1తో దక్కించుకున్న హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని టీమిండియా... శనివారం ఆతిథ్య జట్టుతో ఆఖరి మ్యాచ్‌ ఆడుతుంది. గతంలో ఇంగ్లండ్‌పై టెస్టు, వన్డే సిరీస్‌లు గెలిచిన భారత జట్టు... తాజాగా తొలి టి20 సిరీస్‌ ఖాతాలో వేసుకుంది. టాపార్డర్‌ చక్కటి ఫామ్‌లో ఉండగా... స్పిన్నర్లు సత్తా చాటుతుండటంతో టీమిండియా ఈ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేయగలిగింది. 

ముఖ్యంగా గతంతో పోల్చుకుంటే... మనవాళ్ల ఫీల్డింగ్‌ ఎంతో మెరుగైంది. నాలుగో టి20ని పరిశీలిస్తే... బౌండరీకి సమీపంలో హైదరాబాదీ పేసర్‌ అరుంధతి రెడ్డి చూడచక్కని క్యాచ్‌లు అందుకోగా... 30 గజాల సర్కిల్‌లో రాధా యాదవ్‌ తన ఫీల్డింగ్‌ విన్యాసాలతో కట్టిపడేసింది. ఫలితంగానే ఇంగ్లండ్‌ జట్టు 126 పరుగులకు పరిమితమైంది. అనంతరం టాపార్డర్‌ రాణించడంతో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించింది. అదే జోరు చివరి మ్యాచ్‌లోనూ కొనసాగించి ఇంగ్లండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చాలని హర్మన్‌ప్రీత్‌ బృందం భావిస్తోంది. ఈ సిరీస్‌ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. 

ఇటీవల భారత పురుషుల జట్టు రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై గెలిచిన మైదానంలోనే ఈ మ్యాచ్‌ జరగనుంది. బ్యాటింగ్‌లో వైస్‌ కెప్టెన్ స్మృతి మంధాన, షఫాలీ వర్మ జట్టుకు మెరుగైన ఆరంభాలు అందిస్తుండగా... జెమీమా రోడ్రిగ్స్, అమన్‌జ్యోత్‌ కౌర్‌ నిలకడ కనబరుస్తున్నారు. కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఫర్వాలేదనిపిస్తున్నా... ఆమె స్థాయికి అది తక్కువే. వన్డే సిరీస్‌ ప్రారంభానికి ముందు హర్మన్‌ నుంచి టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తోంది. ఈ సిరీస్‌లో భారత జట్టు జైత్రయాత్ర వెనక స్పిన్నర్ల కృషి ఎంతో ఉంది. 

నాలుగు మ్యాచ్‌ల్లో కలిపి స్పిన్నర్లే 22 వికెట్లు తీశారు. ఈ సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ టి20 అరంగేట్రం చేసిన ఆంధ్రప్రదేశ్‌ స్పిన్నర్‌ శ్రీ చరణి ప్రత్యర్థిని తన మాయాజాలంతో ముప్పుతిప్పలు పెడుతోంది. రాధా యాదవ్, దీప్తి శర్మ కూడా మంచి లయలో ఉన్నారు. మరోవైపు సొంతగడ్డపై గాయాలతో సతమతమవుతున్న ఇంగ్లండ్‌ ఈ మ్యాచ్‌లో నెగ్గి వన్డే సిరీస్‌కు ముందు ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలని భావిస్తోంది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)