Breaking News

CWC 2023: అటెన్షన్‌ ప్లీజ్‌! అహ్మదాబాద్‌కు విమానంలో అయితే అర లక్ష!

Published on Sat, 11/18/2023 - 05:44

యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌! అహ్మదాబాద్‌ వెళ్లవలసిన రోడ్డు, రైలు, ఆకాశ మార్గాలన్నీ కిక్కిరిసి ఉన్నాయి. ఇందులో ఏది ఎక్కినా చుక్కలు చూడటం ఖాయం. తినాలనుకుంటే రేట్లు చూసిన వెంటనే కడుపు నిండిపోయే ‘మెనూ’లున్నాయి. బస చేయాలంటే సాధారణ హోటళ్లలోనే వేల రూపాయలు, స్టార్‌ హోటళ్లలో రూ. లక్షలు... ఫైనల్‌ ఆట కంటే ముందే ‘హాట్‌ హాట్‌’ టాపిక్‌లయ్యాయి.   

అహ్మదాబాద్‌: తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. కానీ యావత్‌ దేశం మాత్రం భారత క్రికెట్‌ జట్టు వన్డే ప్రపంచకప్‌ టైటిల్‌ పోరాటాన్ని చూసేందుకు ఇప్పటి నుంచే సిద్ధమైపోతోంది. ప్రయాణ టికెట్లు వేలకు వేలైనా ... తినుబండారాలు ఖరీదైనా... హోటల్‌ గదులు ఎన్ని వేల రూపాయలైనా సరే భారత అభిమానులు మాత్రం ‘తగ్గేదేలే’ అంటున్నారు.

లక్ష పైచిలుకు మంది ప్రత్యక్షంగా చూసే నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్‌ కోసం ఖర్చులు బారెడైనా... కళ్లు కాయలు కట్టుకొని మరీ చూసేందుకు ఎదురు చూస్తున్నారు.ఆ్రస్టేలియా రూపంలో గట్టి ప్రత్యర్థి ఎదురైనా... 2003 ఫైనల్‌ బూచీ వెంబడిస్తున్నా... టీమిండియా అజేయ జైత్రయాత్రపైనే అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు.

మూడు రోజుల క్రితం న్యూజిలాండ్‌ జట్టుపై గత ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌ ప్రతీకారాన్ని తీర్చుకున్న భారత్‌... 20 ఏళ్ల క్రితం ఆ్రస్టేలియా చేతిలో ఎదురైన ఫైనల్‌ ఓటమి ప్రతీకారాన్ని కూడా తీర్చుకుంటుందని సగటు అభిమానులంతా ఆశిస్తున్నారు. 

విమానం ఎక్కితే... 
అహ్మదాబాద్‌ వెళ్లే విమానం ఎక్కితే దేశంలో ఎక్కడి నుంచైనా దాదాపు రూ. 5 వేల నుంచి 9 వేల లోపే ఉంటుంది. నెలముందు బుక్‌ చేసుకుంటే సగం రూ. 3 వేల లోపే అందుబాటులో ఉంటాయి. కొన్ని సంస్థ ప్రొమో కోడ్‌లతో 500 వందలైనా తగ్గేవి.

కానీ అలా చూసుకుంటే రూ. 2500 టిక్కెట్‌ ధర ఇప్పుడు ఏకంగా రూ. 25 నుంచి 35 వేల మధ్యకు పెరిగింది. ఇది నిన్నటి (శుక్రవారం) ధరలు. శనివారం బుక్‌ చేసుకుంటే మాత్రం అర లక్షయినా ఆశ్చర్యం కలుగక మానదు. పలు విమానయాన సంస్థలు ఆ రూట్లో ప్రత్యేకంగా ఫ్లైట్లు అందుబాటు లో పెడుతున్నా అవేవీ ప్రయాణికుల రద్దీని తట్టుకో లేకపోతున్నాయని టికెట్‌ ఏజెంట్స్‌ చెబుతున్నారు.  

విన్యాసాలకు రిహార్సల్స్‌ 
భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ టీమ్‌ ఫైనల్‌కు ముందు పది నిమిషాల పాటు ఎయిర్‌ షోతో కనువిందు చేయనుంది. ఇందుకోసం శుక్రవారం ఈ టీమ్‌ స్టేడియంపై వైమానిక విన్యాసాలను రిహార్సల్స్‌ చేసింది.  

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)