హీలీ, మూనీ విధ్వంసకర శతకాలు.. ఆస్ట్రేలియా అతి భారీ స్కోర్‌

Published on Sun, 03/01/2026 - 13:11

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హోబర్ట్‌ వేదికగా భారత్‌తో జరుగుతున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా మహిళల జట్టు అతి భారీ స్కోర్‌ చేసింది. టాస్‌ ఓడి టీమిండియా కెప్టెన్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 409 పరుగులు చేసింది. 

కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడుతున్న కెప్టెన్‌​ అలైస్సా హీలీ (మిచెల్‌ స్టార్క్‌ భార్య) (98 బంతుల్లో 158; 27 ఫోర్లు, 2 సిక్సర్లు), వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ బెత్‌ మూనీ (84 బంతుల్లో 106 నాటౌట్‌; 10 ఫోర్లు, సిక్స్‌) విధ్వంసకర శతకాలతో విరుచుకుపడ్డారు. 

జార్జియా వాల్‌ (62) అర్ద సెంచరీతో రాణించగా.. ఆఖర్లో నికోలా కేరీ (15 బంతుల్లో 34 నాటౌట్‌; 4 ఫోర్లు, సిక్స్‌) బ్యాట్‌ ఝులిపించింది. మిగతా ప్లేయర్లలో ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ 14, అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ 23, ఆష్లే గార్డ్‌నర్‌ 4, తహ్లియా మెక్‌గ్రాత్‌ 2, జార్జియా వేర్హమ్‌ ఒక్క పరుగు చేశారు. 

భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా, శ్రీచరణి చెరో 2 వికెట్లు తీయగా.. రేణుకా ఠాకూర్‌, కశ్వీ గౌతమ్‌, దీప్తి శర్మ తలో వికెట్‌ దక్కించుకున్నారు. రేణుకా, రాణా మినహా మిగతా ముగ్గురు భారత బౌలర్లను ఆసీస్‌ ప్లేయర్లు చెడుగుడు ఆడుకున్నారు. కశ్వీ గౌతమ్‌ 10 ఓవర్లలో 83, దీప్తి శర్మ 10 ఓవర్లలో 90 పరుగులు ఇవ్వగా.. శ్రీచరణి 10 ఓవర్లలో ఏకంగా 106 పరుగులు సమర్పించుకుంది. రేణుకా, రాణా తలో 10 ఓవర్లలో చెరో మెయిడిన్‌ వేసి 64, 66 పరుగులు ఇచ్చారు.

కాగా, ఆసీస్‌ ఈ మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండానే ఇదివరకే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆసీస్‌ తొలి రెండు వన్డేల్లో గెలవడంతో ఈ మ్యాచ్‌ నామమాత్రంగా సాగుతుంది. అంతకుముందు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మూడో వన్డే తర్వాత ఇరు జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్‌ కూడా జరుగుతుంది. ఈ మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.    

 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)