Breaking News

IND A vs AUS A: సెంచరీకి చేరువగా సాయి సుదర్శన్‌

Published on Fri, 11/01/2024 - 13:31

ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో టీమిండియా అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగులకే ఆలౌటైన భారత్‌.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ దిశగా దూసుకెళ్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్‌ 208/2గా ఉంది. సాయి సుదర్శన్‌ (96), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (80) క్రీజ్‌లో ఉన్నారు. అభిమన్యు ఈశ్వరన్‌ (12), రుతురాజ్‌ గైక్వాడ్‌ (5) ఔటయ్యారు. రుతురాజ్‌ వికెట్‌ ఫెర్గస్‌ ఓ నీల్‌కు దక్కగా.. అభిమన్యు ఈశ్వరన్‌ రనౌటయ్యాడు. ప్రస్తుతం భారత్‌ 120 ఆధిక్యంలో కొనసాగుతుంది.

అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌటైంది. ముకేశ్‌ కుమార్‌ ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. భారత బౌలర్లలో ప్రసిద్ద్‌ కృష్ణ మూడు, నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఓ వికెట్‌ పడగొట్టారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మెక్‌స్వీని (39) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. కూపర్‌ కన్నోలీ 37, వెబ్‌స్టర్‌ 33, టాడ్‌ మర్ఫీ 33, మార్కస్‌ హ్యారిస్‌ 17, ఫెర్గస్‌ ఓనీల్ 13, సామ్‌ కోన్‌స్టాస్‌ 0, బాన్‌క్రాఫ్ట్‌ 0, ఫిలిప్‌ 4, బ్రెండన్‌ డాగ్గెట్‌ 8 పరుగులు చేశారు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 107 పరుగులకు ఆలౌటైంది. బ్రెండన్‌ డాగ్గెట్‌ ఆరు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాశించాడు. జోర్డాన్‌ బకింగ్హమ్‌ రెండు, ఫెర్గస్‌ ఓనీల్‌, టాడ్‌ మర్ఫీ తలో వికెట్‌ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో దేవ్‌దత్‌ పడిక్కల్‌ (36), నవ్‌దీప్‌ సైనీ (23), సాయి సుదర్శన్‌ (21) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. అభిమన్యు ఈశ్వరన్‌ 7, రుతురాజ్‌ గైక్వాడ్‌ 0, బాబా ఇంద్రజిత్‌ 9, ఇషాన్‌ కిషన్‌ 4, నితీశ్‌ రెడ్డి 0, మానవ్‌ సుతార్‌ 1, ప్రసిద్ద్‌ కృష్ణ 0 పరుగులకు ఔటయ్యారు. కాగా, రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్‌ సిరీస్‌ కోసం భారత-ఏ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది.

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)